"ఆమె ఓ అద్భుతం"
"ఆమె ఓ అద్భుతం"
అక్షరాలకు అందని అందం తనది
మాటల్లో చెప్పలేని మంచితనం తనది
అందరిని ఆదరించే అమ్మ గుణం తనది
ఆప్యాయత అనురాగాలతో ఆమె ఒక నిధి
భావాలను వ్యక్తపరిచే ఆ కళ్ళు
బాధలను మరిపించే తన నవ్వు
వింటూనే ఉండాలనిపించే తన మాటలు
తను ఒ నేల పై నడిచే నక్షత్రం
ఆమె అనుకునే తనకు అందం
తన అల్లరి దానికి ఆభరణం
నమస్కరించేలా ఉన్న తన సంస్కారం
తన వ్యక్తిత్వానికి సరిపోదు సన్మానం