మనసు కాలుష్యం
మనసు కాలుష్యం
మనసు కాలుష్యం
నీటిని కలుషితం చేశాం,
గాలిని విషపూరితం చేశాం,
భూమిని చెత్తకుప్పగా మార్చాం.
ప్రకృతి కాలుష్యానికి
చెట్లు నాటితే చాలు,
ప్రకృతి మళ్లీ
ప్రేమను పంచుతుంది.
కానీ...
మత కాలుష్యంతో
మనిషి మనసును కలుషితం చేశాం,
మనిషిని మనిషి నుంచి వేరు చేశాం,
ఇప్పుడు
మత విద్వేషం
మానవ మనుగడనే
మట్టుబెట్టే స్థితికి చేరింది.
మత కాలుష్యానికి
ఏకైక నివారణ?
మానవత్వమే!
Copyright © Arjun Narra
