Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

jayanth kaweeshwar

Action Inspirational


5.0  

jayanth kaweeshwar

Action Inspirational


దేశ భక్తి- వచన కవితా గీతం

దేశ భక్తి- వచన కవితా గీతం

1 min 19 1 min 19

దేశభక్తి - వచన కవితా గీతం 

(స్వాతంత్య్రదినోత్సవ గీతం )

                         >>కవీశ్వర్ . 01. 08. 2020. 


పల్లవి : ఆదర్శమొలికించు సైన్యమా - దేశ గళానఅమరిన ముత్యమా 

       నీ సేవలే మాకు భాగ్యమా - కోటి వెలుగుల పుణ్యమా 

        భరతమాత వీర సింహమా -మాతసిగలో రత్నమా 

                                   || ఆదర్శ || 

చరణం 1:

గతచరితము మా స్ఫురణమా - వర్తమాన భారత ఖండ రక్షణమా 

రాబోయే భవ్య ప్రగతి పథమా - దేశజన జీవన సాంకేతిక గమ్యమా 

దేశమాత సలిల హిమ శిఖరమా -సానుకూల కర్మబంధ ఫలితమా 

                        

                                  || ఆదర్శ || 

చరణం 2 : 

 భారత రత్నాల జీవితాదర్శమా - అమరులైనవీరచక్రాలవిలాసమా

 వందేమాతర స్వీయ గానమా - అలలవోలె ఱెపఱెపలాడే పతాకమా 

 దేశమాతముద్దు బిడ్డల జ్ఞాపకమా - జనగణముల వందన స్వీకారమా 


                                  || ఆదర్శ || 

చరణం 3: 

విపత్తులందు కృషిచేసే ప్రజా రక్షక దళమా - 

               జాతి లోనవెలుగొందే వృత్తి రత్నమా 

జీవకోటి దయనుచూపే మానవతా వాదమా - 

               అందరిని కలుపుకునే జాతీయ నినాదామా

ప్రాంతములన్నోక్కటై -కలిసివుండే ఆధునిక సమాజమా 

               వివిధభాషలతోకూడిన దేశ కవితా దినోత్సవమా 

                                   || ఆదర్శ || 

వ్యాఖ్య: “ భరతమాత కీర్తి పెంచెడి స్వతంత్ర వందనమా -   

          భవ్య మైన భరతజాతి దేశభక్తిని చాటూమా”


( స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో )


Rate this content
Log in

More telugu poem from jayanth kaweeshwar

Similar telugu poem from Action