STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

తలకి పది లచ్చలు!

తలకి పది లచ్చలు!

1 min
294


మన్నెం లో మసల నేక

తండా లో తిప్పలు పడనేక

గదేదో మంచి బతుకంటే సూద్దమని

నావోలుకు మంచి బతుకినిద్దాం గందా

అని...


అన్నల దళం లో సేరిన!

ఎండకు ఎండిన

వానకు తడిసిన

జంతువులకు జడిసిన

చీకట్లో కాగడాలు పట్టిన


యేహెయ్!

ఏందిరా ఈ బతుకు అని

బయటకు వద్దామనుకుంటే..

తెలిసింది రా ఈరిగా..


నాలాంటోల్ల తలకి పది లచ్చలు

పకటించింది పభుత్వమని


యే మాటకామాటే సెప్పుకోవాలి రా

ఈరిగ!

ఈ పభుత్వం మా సెడ్డ ఒబ్బిడిది 

తలకు పది లచ్చలు..

తగలెట్టడం ఎందుకని..

గా..సూరిగాడి తల తీసేసింది అంట

ఎన్కౌంటర్ లో...!


జనం కి ఏదో సేసేద్దామని

అడవలకి ఎల్లిన అన్నలకే

పది లచ్చలు పాట ఏయిత్తే


ఈరిగా..

ఈ లెక్కన జనం సొమ్ము తిన్న

గా.. నీరవ్ మోది...

    లలిత్ మోది...

    విజయ్ మాల్య ల తలలకి

తలా.. ఓ కోటి సాటింపు ఏత్తాదేమో గంద!


నేకపోతే...

కోటి ఎందుకు ఖరుసు ఎక్కువని

ఆళ్లని కూడా ఖరుసెట్టెత్తాదేమో!

మన సూరిగాడి లా...


ఎందుకంటే...

అసలే... మన పభుత్వం

మా సెడ్డ ఒబ్బిడిది కదా!


అంతేనే..

లేదంటే.. మన ఇండియా ఓళ్ళు

సూత్తు ఊరుకుంటారేట్ర ఒబ్బిడిగ!


     ......రాజ్......



Rate this content
Log in

Similar telugu poem from Tragedy