STORYMIRROR

VENKATALAKSHMI N

Action Inspirational Others

4  

VENKATALAKSHMI N

Action Inspirational Others

సావిత్రీబాయి పూలే

సావిత్రీబాయి పూలే

1 min
308

వేల నక్షత్రాలలో ఒకరిగా జన్మించి

భర్తనే గురువుగా ఎంచి

ఓర్పునే నేర్పుగా భావించి

మహిళా లోకానికే

మరువని చరితగ నిలచిన

మహిళ సావిత్రీ బాయ్ పూలే


పేద బడుగు వర్గాల కై

జీవితాన్ని ధారవోసిన

చదువుల తల్లి

భూస్వాముల అకృత్యాలను

ఖండిస్తూ నే

మహిళలను సంఘటితశక్తులను

చేసిన తొలి గురువు


అట్టడుగు వర్గంలో పుట్టినా

విద్యలో రాణించిన

మహిళా జ్యోతి

మూఢనమ్మకాలను తొలగిస్తూ

బాల్యవివాహాలను ఖండించిన

ధీరవనిత


మహిళా విద్యకు ఆద్యురాలు

మహిళా లోకానికే మహనీయిరాలు

మహిళా జాతి గర్వించదగ్గ స్త్రీ మూర్తి

తెలుగు జాతి గర్వించదగ్గ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు

మన సావిత్రీ బాయ్ పూలే

అందుకో మా నీరాజనాలు



Rate this content
Log in

Similar telugu poem from Action