STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

The Opponent

The Opponent

1 min
374

The opponent!


గమ్యం...గమ్యం..

నిన్ను చేరంగ అయ్యేను 

నా జన్మ ధన్యం!


అనుకొని మనసున..

ప్రతిన పూని మొదలెట్టిన నా గమనం


కానీ...ఏందిర అయ్య...

ఈ గమనం అడుగడునా 

గతుకులే... గుంత లే..

ప్రతిచోటా ...ప్రత్యర్థులే..


నా ఈడు పోర గాండ్రు..

ఇస్కులుకి ఎళ్తాంటే

నాకేమో...

ఎడ్డు మాస్టారు ఎదురు కర్రతో

ఎదురొస్తుండ్రు అన్న నా భయమే ..

నా ప్రత్యర్థి!


పరీచ్చలకంత పోటీ పడి 

సదవతాంటే..

పండుకోరా బుడ్డోడ అంటున్న

నిద్రే...నా ప్రత్యర్థి!


అమ్మ అయ్య సెప్పిన మాటలు

పెడ సెవిన పెట్టమనే..

అహంకారమే..నా ప్రత్యర్థి!


బతుకుదెరువు నెలుక్కోక

బలాదూర్ తిరగమనే...

బుర్రే..నా ప్రత్యర్థి!


కడుపు కూటికోసం కట్టపడే

కదనరంగం లో..

కలబడనీయని .. 

బద్దకమే...నా ప్రత్యర్థి!


బతుకు బాటలో వెనుకబడి 

వేదన పడతాంటే...

బయటపడాలని ప్రయత్నించని..

నా మనసే...నా ప్రత్యర్థి!


జీవిత పయనం అంతటిలోను

ఒక ధ్యేయం లేని

నా ఆలోచనే...నా ప్రత్యర్థి!


అవేదనతో అయిపోయింది

బతుకు...అని

బలికోరే..నా అంతరాత్మే

నా..ప్రత్యర్థి!


మిత్రులారా...

మనకు లేరెవ్వరూ ప్రత్యర్థులు

మనకు మనమే..ప్రత్యర్థులం


నిన్ను నీవు జయించు..

నీ ప్రత్యర్థులకు సైతం..

ప్రేరణ..కలిగించు!


    .......రాజ్.....





Rate this content
Log in

Similar telugu poem from Action