STORYMIRROR

Radha Krishna

Action Inspirational Others

4  

Radha Krishna

Action Inspirational Others

ఎంతదాకా...!!

ఎంతదాకా...!!

1 min
382

ఊపిరి సలపని దీర్ఘాలోచనలు

చేజారకుండా ఒడిసి పట్టాలకున్న

తుంగలో తొక్కిన సమానత్వాలు

బొక్కబోర్లా పడి గుండెకు చిల్లుపెట్టింది

అయినా ఆగని ఆపని పరుగు.

తూరుపున తూర్పారబెట్టాలని పరుగు

కంటికి కనిపించని ముళ్ళు గుచ్చుకుని

బాధ తాళలేక కన్నీరు కారుస్తోంది కాలు

ఎండిన ఆకు ఎగిరి మొహాన్ని దాచేసింది

అయినా ఆగని ఆపని పరుగు.

గాలి బుడగకు చిన్న రంధ్రం

కారిపోతూనే ఉంది ఆత్మ విశ్వాసం

గోడకు గొట్టిన పిడకలా

అతుక్కుపోయిన మనసు

అయినా ఆగని ఆపని పరుగు.

పల్లేరు కాయల మీద ప్రయాణం

అక్కడక్కడా పచ్చని నీరు తాగడానికి కాదు

బురద మీద పడింది వెచ్చగా నిద్ర లేపింది

నాగజముడు మెత్తగా గుచ్చి పారాహుషార్ అంది

అయినా ఆగని ఆపని పరుగు.

సాగించింది జీవన పయనం

సాధించాలని పరుగుల పందేరం.

© Radha



Rate this content
Log in

Similar telugu poem from Action