సన్నని గీత
సన్నని గీత
కన్నులలో కనిపించే భాష్యం
మాటలలో ఒలికించే భావం
చేతలలో చూపించే సాయం
"ప్రేమ" అనుకుని పొరబడతున్నావేమో
బాధ్యత కూడా కావొచ్చు
అర్ధానికి అపార్ధానికి మధ్య
ఉన్న సన్నని గీత లాంటిదే
ప్రేమ, బాధ్యత రెండిటికి
ఉన్న వ్యత్యాసం
తలవెంట్రుక వాసం
గుర్తించపోతే జీవితమంతా
తప్పదు మనస్తాపం.
✍️By Radha
