STORYMIRROR

Radha Krishna

Abstract Classics

4  

Radha Krishna

Abstract Classics

ఒక్క చినుకైనా

ఒక్క చినుకైనా

1 min
392

మేఘాల పందిరి క్రింద

వాన చినుకు ముద్దయి 

చెక్కిలి చేరుతుంటే

చల్లగాలి మేనును అల్లుకుపోయింది.


తనలో నింపుకున్న

ప్రేమను నాకు పంచి


అంతలోనే ...


తాను మాత్రం 

నీతోనే, నీలోనే ఉన్నానంటూ

దూరం జరుగుతోంది.


దూరం భారమయినా

పరవాలేదు.

బహుదూరం కాకూడదు.

అర్ధచేసుకున్న ఆకాశంలో

ఒక్క చినుకునైనా చాలు

నీ గుండెలో పదిలంగా చేరుకోవడానికి.


✍️ రాధ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract