STORYMIRROR

Radha Krishna

Romance Classics Others

4  

Radha Krishna

Romance Classics Others

ప్రేమ..❤️

ప్రేమ..❤️

1 min
407

ప్రేమ....

ఒక గొప్ప అనుభూతి

మహత్తరమైన హృదయస్పందనకు

మహోన్నతమైన మూల పదార్ధం.

కళ్ళల్లో కనిపించే భావాలకు ప్రతిరూపం.

ఎంతటి కఠినహృదయాన్నైనా కరిగించే

శక్తివంతమైన మంచుముద్ద.

దానికి కరిగించడం తెలుసు.

కరిగిపోవడము తెలుసు.

కావలసినది ఒక్కటే....

స్పందింపజేసే మరొక మనసు.

మనసులు మాత్రమే చెప్పుకోగల ఊసులు.

కనుపాపలతో చేసుకునే బాసలు.

దానికి పరిపూర్ణ నిర్వచనం చెప్పేవారు లేరేమో...!!

ప్రతి హృదయాన్ని అతి మృదువుగా స్పర్శిస్తూ

తన లయ విన్యాసాలు చేయిస్తూనే ఉంటుంది.

దాని బారిన పడని జీవి అసలు ఈ సృష్టిలోనే లేదు.

అసలు ఈ సృష్టికి మూలమే ప్రేమ.

రెండు హృదయాలను జతచేసి

ఒక్కటిగా వినిపించే స్పందన.

ప్రేమ...💗

✍️ రాధ " హంసధ్వని"


Rate this content
Log in

Similar telugu poem from Romance