STORYMIRROR

Radha Krishna

Inspirational Children

4  

Radha Krishna

Inspirational Children

యువత'దే'రంగం

యువత'దే'రంగం

1 min
375

కలం పట్టినా, హలం పట్టినా

ఆధునికతను జోడించి

అధిరోహణం చేసేది యువతే.

మేధస్సుకు పదును పెట్టి

ఉత్సాహపు పరుగులెట్టి

కొత్త విశ్వం సృష్టించేది యువతే

ఆవేశం ఉరకలుగా

ఆలోచన ఆయుధముగా

సాయుధబలగమై సాగేది యువతే.

మతం మత్తు వదిలించి

కులం కుళ్ళు కరిగించి

సమసమాజ స్థాపనకై

పోరాడే చీమదండు యువతే

రాజకీయ రణరంగం

మృగక్రీడల మృదంగం

మత్తు పురుగుల వీరంగం పీచమణిచి

ఉప్పెనై ముంచేది యువతే.

తలుచుకుంటే, తమదనుకుంటే

తలపడి, పోరాడే

అద్వితీయ తరంగం

యువతదే ప్రతిరంగం.

✍️రాధ"హంసధ్వని"



Rate this content
Log in

Similar telugu poem from Inspirational