STORYMIRROR

Radha Krishna

Tragedy Crime Others

4  

Radha Krishna

Tragedy Crime Others

ఎక్కడకిపోతోంది..??!

ఎక్కడకిపోతోంది..??!

1 min
545


పైత్యపు ధోరణలు

వికారపు వికృతులు

పైశాచాకత్వపు పంధాలు

ఎక్కడికి దారితీస్తాయో..!

పెళ్లి అనే పవిత్ర బంధానికి తిలోదకాలు విడిచి...

జన్మనిచ్చిన గర్భాలయానికి గుంట తవ్వి..

పేగు బంధాన్ని సైతం పాతిపెట్టి..

ప్రేమ అనుకునే మోహపు

ప్రవాహంలో కొట్టుకుపోయే...

మోహాంధుల పయనం ఎక్కడివరకు...?

తాళికట్టిన ... తోడబుట్టిన

జన్మనిచ్చిన... కోరికల కాటుతో

తోడేసే సమాజంలో నైతిక

విలువల జాగరణ ఎంతవరకు...??

కామపు గరళ పొరలు కళ్ళను కమ్మేసి...

ముసలి - ముతక, నారీ - నరులు

చివరకు నపుంశకులను కూడా

వదలని కామాంధపు కలి

బలుపుకు కాలుడి పాశం సైతం పలాయనం చిత్తగిస్తే...

ఎక్కడుంది నైతిక విలువ...!!

ఎంతవరకు వెళుతుంది దీని తెగువ..!!

✍️ హంసధ్వని


Rate this content
Log in

Similar telugu poem from Tragedy