STORYMIRROR

Radha Krishna

Classics Others

4  

Radha Krishna

Classics Others

నీతో స్నేహం...విడువను ఓ నేస్తం

నీతో స్నేహం...విడువను ఓ నేస్తం

1 min
352

అ..ఆ..ల నుండి అనంత ప్రేమ వరకు నేర్పిందే నీవు

అక్షరాల తడబాటును అలవోకగా మార్చిందే నీవు...

ఆశల తీరం వెంబడి సాగే నా పయనంలో

అనంత అలజడుల నడుమ సాగే నా యాత్రలో

కనిపించకుండా సాగే తోడు నీవు...

జీవన సాధనలో

శిలను శిల్పంగా...

రాయిని రత్నముగా ...

మోడును చిగురుగా...

చినుకును ముత్యంగా... మార్చింది నీవు....

ఓటమికి వీడ్కోలుగా

గెలుపుకు పునాదిగా

నిశీధిలో వెలుగురేఖగా

నిరాశలో ఆశల నిధిగా....మారింది నీవు....

నీతో గడిపే అనుక్షణం మంచువర్షమే నా పైన

నీతో పలికే ప్రతి పదం అనురాగ ప్రవహమే ఎదలోన...

నీతో స్నేహం ఓ మధుర స్వప్నం

చేరుస్తోంది నను కలల గమ్యం..

అందుకే....

ఎప్పటికీ నీ స్నేహం...

విడువను ఓ నేస్తం.

✍️By Radha.


Rate this content
Log in

Similar telugu poem from Classics