STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

యూత్!

యూత్!

1 min
374

వివేకానందా.. ఓ..విజ్ఞాన శక్తి!


ప్రపంచం లో ..

అత్యంత శక్తివంతమైనది..

అణు ఆయుధం!


దాన్ని మించిన...

అంత్యంత శక్తివతమైన..

పలుకులను ప్రపంచానికి ఇచ్చిన

భారత ఆయుధమే ..

మన వివేకానంద!


పాశ్చాత్యులు ఇచ్చిన

అణు ఆయుధం ..

మానవ ప్రాణాలను తీస్తే!


వివేకానంద అనే ఆయుధం 

మానవుని ఆత్మశక్తి ని బయటకు తీసింది..


ఓ..యవతా!

హుద్ హుద్ తుఫాన్ కున్న వేగం

నీ సొంతం!

నైతిక సమాజ నిర్మాణంలో

అడ్డొచ్చే ఆగంతుకులను ..

నీ వేగంతో వెడలగొట్టేయ్!


ఉక్కును కరిగించే వేడి

నీ రక్తానికి సొంతం

ఆడ పిల్లల మాన ప్రాణాలను

హరించే వాళ్ల ఆట కట్టించేయ్!


సునామీ కున్న శక్తిని మించినది

నీ ఆత్మ శక్తి!

అద్భుతాలు సృష్టించేయ్!


అణుబాంబు విస్ఫోటనం లో

వచ్చిన శబ్ధం అంతటి...

పెద్దది నీ గళం!

అన్యాయాన్ని..ప్రశ్నించేయ్!


అభిమన్యునంతటి వీరోచిత పోరాటం

నీలో ఉంది!

నువ్వు అనుకున్నది సాధించే వరకు

నీ ప్రాణం పోయేంత వరకు...

పోరాడు!


ఓ యువత

ఇంతటి శక్తిని...

నవసమాజ నిర్మాణంలో వాడకపోతే

ఖచ్చితంగా..

నువ్వు నీ సమాజానికి ద్రోహం 

చేసిన వారిలో ఒకడివి అవుతావ్!


అందుకే.. ఓ యువతా!

వివేకానంద చెప్పినట్టు

శక్తిని స్మరించండి

శక్తివంతులుగా..తయారవండి!


       .......రాజ్...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action