STORYMIRROR

THOUTAM SRIDIVYA

Abstract Action Inspirational

4  

THOUTAM SRIDIVYA

Abstract Action Inspirational

"ఆదిశక్తి......"

"ఆదిశక్తి......"

1 min
390

******ఆదిశక్తిలా మారాలి ఆడవాళ్ళు******


అష్ట లక్ష్మిలను పూజించే ఇదే దేశంలో

అష్ట దరిద్రాలు అనుభవించే స్త్రీలున్నారు

అంగట్లో సరుకుకు ఉన్న విలువ

ఆడదానికి లేదిక్కడ

 

అందరూ సమానమే అని 

అందరిముందు అరిచి చెప్పినా

ఆనక ఇంట్లో నాకంటే కాస్త తక్కువే 

అన్నట్లు వ్యవహరిస్తారు


అణుబాంబులు

అనుక్షిపణులు తయారుచేయడం సులభం

ఆడదాని రక్షణకు 

అవేమీ సరిపడవు


అందుకే తయారవ్వాలి

ఆదిశక్తిలా మనం

అణిచివేసే శక్తులపైన

అత్యాచారం చేసే మృగాలపైన విరుచుకుపడాలి


ఆడవాళ్ళకు అన్నింటా

అవధులే చూపే సమాజానికి

అడ్డంకులన్నీ జయించి

అద్భుతాలు సాధించి

ఆడవారి సత్తా చాటాలి



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract