STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

5  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

రంగస్థలం - వచన కవితా సౌరభం

రంగస్థలం - వచన కవితా సౌరభం

1 min
348

రంగస్థలం - వచన కవితా సౌరభం : కవీశ్వర్

14.05.2021 : (ప్రాంప్ట్ - 14)

ప్రపంచమే ఒక రంగస్థలం - ఈ మానవులందరూ పాత్రలు- పాత్రధారులు 

భగవంతుడే సూత్రధారుడు - జనన- మరణ , క్రియ ప్రతి క్రియలు దారాలు 

మానవుని మనోఫలకమే - అంతరంగమే రంగస్థలం - ఆత్మ సూత్రధారి -

 బుద్ధి , పంచేంద్రియాలు పాత్రధారులు - సుకర్మలు , దుష్కర్మలు దారాలు 


విచక్షణ - తెలివి - కళ్ళాలు -- మేలును గుర్తించి క్రియలు / కర్మలు చేస్తారు.

అరిషడ్వార్గాలే సుకర్మలకు గొళ్ళాలు - ఎప్పడూ మంచి పనులకు ఆటంకాలు

విద్యాలయాల రంగస్థలాల్లో - విద్యార్థుల ప్రతిభ అభి వ్యక్తము చేయు విధాలు 

కీర్తి ప్రతిష్ఠల ప్రామాణికాలు - ఆ సందర్భ ప్రేక్షకుల ఆనందవిజయ సందోహాలు 


తెరవెనుక సూత్రధారులు రచయితలు వారులేని రంగస్థలాలు దాదాపు 

ఎక్కడా ఉండనే ఉండవు (వాచకవిధములో తప్ప) నిరభ్యరంతరంగా అందరు 

దర్శకులు, నిర్మాతలు గాయనీగాయకులు వీరందరూ కూడా రచయితల తర్వాతే

వీరందరి సహాయ సహకారములతోనే ప్రపంచ రంగస్థలం ఇప్పటికీ వర్ధిల్లుతుంది. 


వ్యాఖ్య : "రంగస్థల ప్రాభవం ప్రస్తుతం కొద్దిగా మసకబారుతుంది . ఈ ప్రక్రియకు 

 పూర్వపు వైభవాన్ని తీసుకురావాలంటే ఈ రంగమున ఉన్న ప్రతిఒక్కరూ ప్రభుత్వాల సహాయంతో 

ఇతోధిక కృషిని సల్పాలి . ఎలక్ట్రానిక్ మీడియా సహాయంతో సినీ రంగానికి ఎలాంటి ప్రాభవాన్ని 

తీసుకొచ్చారో , అలాంటి ప్రాభవాన్ని తీసుకువస్తే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నా అభిప్రాయం,"


కవీశ్వర్ . జయంత్ కుమార్ రాజేంద్రనగర్ , హైదరాబాద్ 



Rate this content
Log in

Similar telugu poem from Abstract