కరోనా మారదు
కరోనా మారదు
" కరోనా మారదు - RK "
==================
ప్రేమలేని కవితలల్లి
ప్రేమరాని కథలలొల్లితో
జీవితమొక నాటకమని
విధిరాతొక బూటకమని
వింతల్ని చూపేదో కటకమని
తాను ముఖ్యమనుకొన్న తనువుని
మన్నుగా చేసిందో కరోనా అణువు
కరుణలేని కరోనా నిర్లక్ష్యంగుంటే నిలువునా
అజాగ్రతగుంటే అట్టడుగునా పాతేస్తుంది
అయినా మనిషి మారడు
అలాగనీ తన వంతుని కోరడు
ఎవరికో అమాయకులకి అంటించిపోతాడు
చివరికి తనవాళ్లక్కూడా బిగిస్తాడా ఉరితాడు
మనిషి చదువుకొన్న మూర్ఖుడు
పరులహితాన్ని కోరని దౌర్భాగ్యుడు
తన కళ్ళముందే మనుషులు పిట్టల్లా రాలుతున్నా
బాధితుల, బంధువుల అర్తనాదాల్ని వింటున్నా
నిర్లక్ష్యంతో మనిషి బయటికీ రాకుండా మానడు
మారని మనిషి కోసం కరోనా మారదు
మానవలోకానికి విపత్తు మిగిలించకా మానదు......"