Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

EERAY KHANNA

Drama Inspirational Thriller

4  

EERAY KHANNA

Drama Inspirational Thriller

ఓ కడలి తరంగం

ఓ కడలి తరంగం

1 min
353


ఓ కడలి తరంగం 


ఓ వైపు ఓరుగాలిలో చిక్కుకొని చిరిగిపోతున్న బ్రతుకు తెరలు

మరో వైపు కెవ్వుమని అరుస్తున్న కెరటాల మధ్య తాళలేక తడబడ్తున్న గాలి మరలు 

జోరువాన జోరులో, కెరటాల కేకలో నా ప్రాణసఖి అంతర్మథనం వినిపిస్తూనే ఉంది

నేను ఒంటరివాణ్ణి , ఓడిపోయినా వాణ్ణని నా అంతరంగం విలాపిస్తూనే ఉంది

ఆ సముద్రతీరం ఇసుక తిన్నెలపై జారిపోతున్న రేణువులపై కాళ్ళు చాపి

 కళ్ళు తెరిచి ఆశగా సంద్రంలోకి చూడటం నా  కొత్త మనసుకది పాతే

రివ్వున తాకే సంద్రపు గాలిలో నా చెలి స్మృతులు మిగిల్చింది నా గుండెకి కోతే


“ – చెప్పులు లేక చెప్పుకోలేకా అరిగిపోయిన నగ్నపాదాల్లాగా అమాయకుల

ఆవేదన, అమాయకత్వాలు, కన్నీళ్లు నీకెపుడైనా కనిపించాయా!

మనసే లేని మనుషుల మధ్య హీనంగా బ్రతకడం కంటే మనసున్న మృగాల మధ్య

మనుషులుగా బ్రతకాలనుకొనే బతుకుహీనుల బాధలు వినిపించాయా!

నటనే జీవితమయ్యాకా, జీవితమే నటనయ్యాక మన ఆలోచనలు, ఆశలు

నిర్జీవమైన వాస్తవంలో బ్రతకలేవని  తెలుసుకోగలిగామా!

గురుబ్రహ్మల గురుకులంలో నేర్చుకొన్న విద్యని నాశనం చేసి ,అమాయకుల

నషాళానికంటించే నిషాణంలా మారిన చదువులెందుకనీ ఆలోచించామా!

కలం, గళంల బలం తెలుసుకోలేని మూర్ఖులమౌతున్నామని,

ఉరుకు పరుగుల జీవితంలో ఊపిరి సల్పని ఉపద్రవముందని ఊహించామా!

తెలుగు మాట్లాడేవాన్ని తెలివిలేని వాణ్ణిగా చేసి, పరాయి భాషకి పబ్బం కట్టి

పండుగ చేసుకొనే మన వెఱ్ఱితనం ఓ చరిత్ర అవుతుందని చంకలు గుద్దుకోగలమా! “


 

ఇవన్నీ కల్పించి రాస్తున్నానని, కవ్వింపుకు  కాలుదూస్తున్నాననీ నా కలానికి చిక్కి, 

చెక్కినా అభూత శిల్పాలు కావని నేను చెప్పగలను!

నేను విసిగిస్తే క్షమించమని అడగను, అస్సలు బాధపడను

ఇవి నా మాటలు కావు, నా ప్రాణసఖి నా గుండెకి వేసిన తూటాలు !

ఎవరు నమ్మరు గాకా నమ్మరు, ఇసుక తిన్నెలపై తన ఒళ్లో ప్రేయసిని పడుకోబెట్టుకొని

ఆమెలో తానూ పడుకొని ఇలాంటి మాటలు మాట్లాడుకోరని నమ్మరని నేనంటాను!


“ ప్రేమికుల్ని, శ్రామికుల్ని కాల్చిచంపిన వాళ్ళని భళా అని అనడంలోని మూర్ఖత్వం

చంపేవాళ్లే ప్రేమోన్మాదులు, మతోన్మాదులు, ఉన్మాదులని గ్రహించని అమాయకత్వం 

బాధలోనూ, ఆనందంలోనూ ఒక కన్నుతోనే ఏడ్వడం రాదని తెల్సుకోలేని నిస్సాయతత్వం 

నీచమైన, అగమ్యగోచరమైన ఆలోచనలు చేసే ఒంటరితనాన్ని మనిషి ప్రేమిస్తూనే ఉన్నాడేందుకు? “ 


ఇలా మాట్లాడే ప్రేయసిని ఎవరు ప్రేమిస్తారు?, కానీ ఓ కడలి తరంగం ప్రేమించింది

ఎంతలా అంటే, ఈ రోజు నా పాదాల మీదుగా జారిపోతున్న ఇసుక రేణువులా జారిపోయింది

నా కనులకు దూరమై, నా కలలకు భారమై, ఆ కడలి తరంగానికి చేరువై వెళ్ళిపోయింది 

తిరిగి రాదనీ తెలిసి కూడా ఎదో చావని ఆశతో ఎదురు చూస్తూ ఏకాకిలాగా మిగిలాను…!


--ఈరే

రచనా కాలం: 2010


Rate this content
Log in

Similar telugu poem from Drama