STORYMIRROR

EERAY KHANNA

Abstract Action Inspirational

3  

EERAY KHANNA

Abstract Action Inspirational

కవిత్వమెందుకు

కవిత్వమెందుకు

1 min
201

       " కవిత్వమెందుకు "-RK

            

నా మిత్రులంటారు నీకు కవిత్వమెందుకనీ

నా ఆత్మీయులంటారు నీకు కన్నీళ్ళెందుకానీ

నా మనసంటుంది నీకు కష్టాలెందుకనీ

నా జీవితమంటుంది నీకు కరిగే హృదయమెందుకనీ 

కానీ నన్ను నేనుగా అనుకొంటాను కవిత్వాన్ని

రాయకూడదెందుకనీ???

మనుషుల మనసులు కరిగించడానికి,

కరిగిన మనసుల్ని కదిలించడానికి

మూగబోయిన గొంతులో రవ్వంతా

స్వరాన్నైనా రగిలించడానికి,

అణగారిన బ్రతుకుల్లో, అడుగంటిన ఆశల్లో

కాస్తయినా జీవితాన్ని మిగిలించడానికి,

న్యాయంకోసం గొంతుపెగలని పేదజీవుల్లో

గాయాలైన ఆగిపోకు అని గొంతెత్తి చెప్పడానికి,

అర్థంకానీ అసమానతల మధ్యనా

అమాయకుల అంతరంగం చిక్కుకొన్నప్పుడు

ఆ అంతరంగాన్ని సంకెళ్లతో బంధించినప్పుడు

ఆ సంకెళ్లని తెంచేసి వారినక్కడి నుండి

విడిపించి, నడిపించే కవిత్వాన్నీ 

రాయకుండా నేనెలా ఉండగలను?...

అందుకే నా కళ్ళలో కన్నీళ్లు కరిగాకా

అవి ఏరులై పారాకా, ఆ వరదలో

కొట్టుకుపోయే దుస్థితితో ఏ అంచనకి రాలేకా

నా అక్షరాల్ని ఏర్చి, సుడిగుండంలా కూర్చి

మళ్ళీ మళ్ళీ మార్చి రాయాలనుకొంటాను.

ఈ సమాజంలో మార్పు వచ్చేదాకా 

నా కలానికి కాలం చెల్లేదాకా

నా చేతులు అరిగిపోయేదాకా

కవిత్వం రాస్తూనే ఉంటాను.

- RK



Rate this content
Log in

Similar telugu poem from Abstract