STORYMIRROR

EERAY KHANNA

Drama Crime Inspirational

4  

EERAY KHANNA

Drama Crime Inspirational

అత్యాచారంపై హత్య

అత్యాచారంపై హత్య

2 mins
276

" అత్యాచారాన్ని హత్య చేసిన అక్షరం "

                                         - రాజేష్ ఖన్నా

************************************

 ఓ పసిపాప నీవు చేసిందేమిటి నేరం!.

 ఎందుకు నీ పట్లా జరిగింది ఈ ఘోరం !!

 నీ కేకలు విని సమాజం చేరేది ఏ తీరం!

 నీ ఏడ్పుపాటకి ఏడ్చింది మా సింధూపురం!!

 నిన్ను కన్నది ఓ మొనగాడు!

 నిన్ను చిదిమింది ఓ మోసగాడు!!

 నీ ఏడుపుపాట దేశానికో శాపం!

 నిన్ను బ్రతకనివ్వకపోవడమో పాపం!!

 ఎవరికి అంతలా భారమయ్యావు!

 ఎందుకు నీ చిరునవ్వుతో దూరమయ్యావు!!

 నీ బోసినవ్వులతో మాయ చేశావు!

 మృగాల కాటుకి మాయమయ్యావు!!

 నీ ప్రాణం తీసే హక్కు ఎవరికుంది!

 నీ కోసం అడిగే దిక్కు ఎక్కడుంది!!

 చతికిలపడ్డ చట్టానికుందా!

 అక్కరకు రాని అధికారులకుందా!!

 మూగబోయిన నీ గొంతుని ఏ కోకిలకిచ్చావ్!

 ఆగిపోయిన నీ అల్లరిని ఏ గువ్వలకిచ్చావ్!!

 నిన్ను ఎత్తుకెళ్తున్నా మౌనంగేందుకున్నావ్!

 నిన్ను మట్టిని చేసిన మృగానికేం చెప్పావ్!!

 నీ ప్రాణం తీస్తేగానీ ఈ లోకానికి కళ్లు కనిపించలేదు!

 నీవు శవమైతే గానీ నీ అరుపులు వినిపించలేదు !!

 లోకమంతా ఏకమై ఏడిస్తేగాని బాధనిపించలేదు!

 ఈ నటులందరిని చూసి కరిగిపోకు తల్లీ!!

 నీ పసితనాన్ని చిదిమిన పాపం ఈ లోకానిది కాదా!    నీవు చస్తేగాని స్పందించని ఈ మేధావులది కాదా?      

 నిన్ను చంపిందే ఈ లోకమైతే ఎవరికి శిక్ష వేస్తారు?

తమ పిల్లల్ని మృగాల్లాగా వొదిలిపెట్టిన తల్లిదండ్రులకా?

మతం, కులం అని మభ్యపెట్టే మత బోధకులకా?

పసలేని పాఠాల్ని చెప్పే అధ్యాపకులకా?

విలువలు లేని వివేకవంతులకా?

పద్దతి లేని పామర పాలకులకా?

ఈ లోకంలో మనిషే కదా అతీక్రూరమైన మృగం

కొందరు అవకాశాలు రాకా

మరికొందరు ఆలోచనలు లేకా

మంచివాళ్ళుగా చెలామణి అవుతూ చెలాయిస్తుంటే

చతికిలపడ్డ చితిమంటల్లో చిత్తుకాగితాల మాదిరి

తగలబడిపోతున్న తత్వవేత్తల మేధస్సుకి

మెలకువ రాకా బూడిదైపోయింది.

నీ మీద జాలిపడి నేను రాయట్లేదు

నీ గుండె బాధని నేను మోయట్లేదు

మనుషుల్లో పుట్టి నేనూ ఓ మృగమయ్యాను

మాటలు రాకా మ్రానయ్యాను

ఏమో! తెలియకుండానే కన్నీళ్లు రాలిపడ్తున్నాయ్

నిద్రరాని కలలన్ని బాధతో తూలిపడ్తున్నాయ్

నిన్ను కాపాడుకోలేని నా అశక్తతకి

అక్షరరూపం ఇవ్వలేను!

నిన్ను చూసి ఏడుస్తున్న కన్నీళ్ళకి ఏరై పారలెను!!

నేను నిన్ను కాపాడలేకపోయాననే కలతకి 

కారణం చెప్పలేను!

కానీ, నిన్ను హంతం చేసిన అత్యాచారాన్ని మాత్రం

హత్య చేయగలను!

నిన్ను కాపాడలేని నా అక్షరాలు సిగ్గుతో తలదించుకున్నాయ్!

నీతో మాట్లాడలేని నా ఆలోచనలు ఉరి వేసుకున్నాయ్

నీ పేరు విని నా కవితలు భయంతో వణికి పోతున్నాయి

నీ మూడు రూపాలు మూన్నాళ్ళకే ముగిసిపోయాయి

తల్లి, భార్య, కూతురు లేని సమాజం నెరసిపోయింది

నా చేతులు రాయలేని ఈ కవితని

నా కన్నీళ్లు రాయడానికి సిద్దపడ్డాయ్

నేను వెళ్ళని చోటుకి నా అక్షరాలు అనుమతి లేకుండానే పరుగులు తీస్తున్నాయి

బహుశా నిన్ను చంపిన అత్యాచారాన్ని హత్య చేయడానికేమో కాబోలు!

******** సమాప్తం*******

ధన్యవాదములు

మీ

-రాజేష్ ఖన్నా


 

  

 

 

 

 

 

 



Rate this content
Log in

Similar telugu poem from Drama