STORYMIRROR

EERAY KHANNA

Drama Tragedy Inspirational

4  

EERAY KHANNA

Drama Tragedy Inspirational

ఆమె కోసం

ఆమె కోసం

1 min
364

       " ఆమె కోసం " - రాజేష్ ఖన్నా

          ======================

అవని నిట్టూర్పులు నిర్లిప్తమయ్యేది

తామసి తాండవలు నిర్వీర్యమయ్యేది

పగటి పరువాలు నిర్భంధమయ్యేది

పుడమి పులకింతలు మాయమయ్యేది

అన్నీ పడతి రెప్పవాల్చిన క్షణాల మధ్యలోనే

రాత్రికి నిద్రపుచ్చి వేకువకి వెలుగులిచ్చి

వెన్నెలకి జోలపాడి, పగటికి పసిడిని తొడిగి

జీవితపు పరిమళాల్ని జీతంతెచ్చే దేవుడికిచ్చి

మమతల మకరందాన్ని మారంచేసే పిల్లలకిచ్చి

తనకోసం ఏమి మిగిలించుకొనిదే స్త్రీమూర్తి

ఇళ్ళు కదలని మైళ్ళు నడిచి

కళ్ళు వదలని కలల్ని విడిచి

కనురెప్పల మాటున కుటుంబాన్ని దాచి

కనులు నిండని నిద్రతో పనులు పండని

గందరగోళంలో గడిపేదే నేటి నెలత

మనుషుల మనసెరిగిన మనోయంత్రంలా

ప్రతీ సమస్యకు సరైన మార్గంచూపే తంత్రంలా

తన వాళ్ల బాధల్ని భయాల్ని పోగొట్టే మంత్రంలా

అంతులేని స్వేచ్ఛ ప్రసాదించిన స్వతంత్రంలా

అలుపెరుగని పోరాటయోధురాలే మహిళా

శ్రామికురాలిగా, కర్శకురాలిగా చేసిన సేవలెన్నో

జీవితాల శిల్పిగా మారి నిల్పిన శిల్పాలెన్నో

స్వార్థం తెలియని త్యాగిలా చేసిన దానలెన్నో

వనాల్లో వాలిన వసంతంలా, వసంతం కోసం

మారిన వర్షంలో అన్నింట్లో తానుగా ఒదిగేదే స్త్రీ

స్త్రీ ఒక్క చోటేమిటి విశ్వమంతా విస్తరించి

తన శక్తియుక్తుల్ని విచ్చలవిడిగా ప్రదర్శిస్తుంటే

లోకం తన కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంటే

స్త్రీకి కొత్తనిర్వచనం కొత్తరూపం ఇవ్వకతప్పలేదు

ఆమె ముందు తలవంచకా తప్పలేదు


ఇన్నాళ్లు స్త్రీ ఒక శిల్పమని భ్రమపడ్డాను

ఆ శిల్పం మరో శిల్పాన్నివ్వడంతో సందేహాపడ్డాను

ఇంతకీ స్త్రీ శిల్పమా, శిల్పినా అన్నచోటే ఆగిపోయాను

ఆమె శిల్పినేనని తెలిశాకా చిందులేయడం మానేశాను

అయినా ఆ శిల్పి కోసం ఈ శిల్పం కూర్చిన

అక్షరాల కూర్పు ఏపాటిది?!.

   

                   ****** సమాప్తం *******

            



Rate this content
Log in

Similar telugu poem from Drama