STORYMIRROR

EERAY KHANNA

Drama Action Inspirational

3  

EERAY KHANNA

Drama Action Inspirational

రణ రైతాంగం

రణ రైతాంగం

1 min
189

         " రణ రైతాంగం " - రాజేష్ ఖన్నా

             =========================

కొండలు ఎత్తుగా ఉంటేనేం వాటిని

పిండిచేయగల సంకల్పం మాది

భూమి బీడుబారితేనేమి దాన్ని దున్ని

దుక్కిచేయగల శక్తియుక్తులు మావి

వర్షం భూమికి ప్రాణం పోయకపోతేనేం

మా రక్తంతో నేలని తడిపే తెగింపు మాది

పంట దిగుబడి ఇవ్వలేకా మా సహనాన్ని

పరీక్షిస్తేనేం భూమికున్నంతా ఓపిక మాకుంది

దళారులు మా పంటని చౌకగా కొనేస్తేనేం

మానుండి దోచుకోలేని శ్రమ దాగుంది మాలో

రైతులమని మమ్మల్ని లోకం చిన్నచూపు

చూసినా నిత్యం ప్రేమించే పొలం మాకుంది

పంటచేలో కలుపుమొక్కల్లా పెరిగే మనిషి

ఆలోచనల్ని పెరికేసే ధైర్యం కూడా ఉంది

అడుగడుగునా కష్టాలోస్తేనేం కన్నీళ్ళని

అమ్ముకొనైనా బ్రతికే దమ్ముంది మాకు

ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తేనేం

నీతిగా బ్రతికే సత్తా ఉంది మాలో

మాకు అన్నం దొరక్కపోతేనేం లోకానికి

కడుపునింపడానికి వెనుకాడని నైజం మాది

ప్రభుత్వం మా పిల్లలకి ఉద్యోగాలివ్వకపోతేనేం వ్యవసాయం కూడా గొప్ప ఉద్యోగమని చేప్తాo

మా కన్నీళ్లు లోకానికి కనిపించపోతేనేం

లోకాన్ని చూడగలిగే హృదయం మాదంటాం

చట్టాలు మారినప్పుడల్లా చప్పట్లు కొట్టేవాడు

మారిపోతేనేం మారని మనుషులం మేమంటాం

మా బ్రతుకులు రోడ్డేక్కితే అడిగేవాడు లేడు

మేం రోడ్డెక్కితే ఆపేవాడు, అరిచేవాడు వస్తారు

మా ఓట్లు కావాలి, మా ఉత్పత్తులు కావాలి

మార్పు మాత్రం మా పోరాటంతోనే రావాలి

           ****** సమాప్తం******



Rate this content
Log in

Similar telugu poem from Drama