STORYMIRROR

EERAY KHANNA

Abstract Action Inspirational

4  

EERAY KHANNA

Abstract Action Inspirational

ఇంకెన్నాళ్లు

ఇంకెన్నాళ్లు

1 min
399

      " ఇంకెన్నాళ్లు " - రాజేష్ ఖన్నా

      =========================

మనుషుల్ని మాటల సంకెళ్లతో

బంధించి మతాల ముసుగుతో

భయపెట్టి మానసిక బలహీనతలతో

బాధించి దబాయింపు వారసత్వంతో

వేధించి బ్రతకడమెన్నాళ్ళు

మనసు అంతరాలల్లో అతుక్కుపోయినా

మూఢత్వాన్ని వలచి వదల్లేకా

ముసుగుపొరల చాటుగా మూలుగుతూ

నగ్నత్వాన్ని బయట పెట్టలేకా

దారిద్ర్యపు దాష్టికంలో నలగడమెన్నాళ్ళు

ఎదుటివాళ్ళు ఏదో చేస్తారని

నిత్యం భయపడుతూ, భ్రమపడుతూ

మనసుని అదుపుచేసి మాటల్ని పొదుపుచేసి

జీవంలేని అధరాలు జిహ్వని అడ్డుకొంటుంటే

అదుపులో బ్రతకడమింకెన్నాళ్ళు

అంతరార్థం తెలియకుండా

ఆర్తనాదాలు విడవకుండా 

అర్థం పరమార్థంలేని జేజేల 

బానిసత్వమే బ్రతుకు పోరాటమని

గుడ్డిగా బ్రతకడమింకెన్నాళ్ళు

        ***** సమాప్తం*****


Rate this content
Log in

Similar telugu poem from Abstract