STORYMIRROR

EERAY KHANNA

Drama Action Inspirational

4  

EERAY KHANNA

Drama Action Inspirational

భాష చచ్చిపోతోంది

భాష చచ్చిపోతోంది

1 min
345

   " భాష చచ్చిపోతోంది " - RK

భాషకి ప్రాణం ఉంటేనే కదా చావడానికి

ప్రవాహం ఉంటేనే కదా బలహీనమై

గాలిలా కొట్టుకుపోవడానికి

ఊపిరి ఉంటేనే కదా ఊపిరాడకుండా 

చచ్చిందనడానికి

అయినా రానీ భాష ఉంటే ఎంతా,  పొతే ఎంతా

అవసరాలు తీరనప్పుడు, అన్నం కాస్త అయినా పెట్టనప్పుడు భాషకి ప్రాణం పోయినా ఫర్వాలేదు

తన ఉరుకు పరుగుల జీవితంలో ఊసేలేకుండా ఊగిసలాడే భాషకి ఊపిరి ఆగిపోతే నాకేంటని

నిర్లక్ష్యంగా నిస్సంకోచంగా బాహాటంగా చెప్పే

తెలివి పరులున్నంతా కాలం భాష 

చచ్చిపోతూనే  ఉంటుంది.

భాషని బ్రతికించాల్సిన బాధ్యత ఎవరిదీ?.

వ్యక్తిగతంగా ఎవరికీ వారిదేనా?.

సమీష్టిగా సమరం చేయాల్సినా బాధ్యత

అందరిమీదా ఉంది కదా. 

నేటితరం పిల్లలకి ఎంతమందికి తెలుగు చదవడం, రాయడం వచ్చో, బాషని తమ బద్ధకంతో 

బలిచేసినా తల్లిదండ్రులకే తెలుసు.

రాని పరాయి భాషలవెంబడి పరిగెత్తి గొప్పలకు

పోయి తిప్పలు పడటం కంటే మన మధురమైన

భాషని నేర్చుకోని భాషని బ్రతికించవచ్చు కదా. 

- RK



Rate this content
Log in

Similar telugu poem from Drama