Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

కవితా పూరణం - ఒక వినూత్న ప్రక్రియ [సృజన మరియు కల్పన] (కవీశ్వర్ )

కవితా పూరణం - ఒక వినూత్న ప్రక్రియ [సృజన మరియు కల్పన] (కవీశ్వర్ )

4 mins
345


కవితా పూరణం - ఒక వినూత్న ప్రక్రియ 

[ సృజన మరియు కల్పన] (కవీశ్వర్ ) 

ధారా వాహిక : 26.02.2022

ఉపోద్ఘాతం: మనకు ఎన్నెన్నోకవితా ప్రక్రియలు ఉన్నాయి .  ప్రక్రియలో కవితా లాలసను ,

పాఠకుల ఆలోచనా సరళిని అనుసరించి కవుల సౌలభ్యా నుసారము - ఈ ప్రక్రియ ను ఒక పరిశోధనా వ్యాసము గా వెలువరించుచున్నాను . సాధారణంగా ఒక కవితను రాయటానికి అర్థవంతమైన పదముల కూర్పును భావయుక్తము గా ,కవి అనుకున్న విధముగా కొన్ని కవితా సౌరభాలను అందించగలడు. అందులో వచన కవిత సౌరభం ఒకటి. అందులో ఆది ప్రాస కానీ, మధ్య ప్రాస కానీ లేదా అంత్య ప్రాస కానీ ఉపయోగించి అనుకున్న అంశము పై కవిత ను రాస్తాడు. అయితే ఇక్కడ ఛందో బద్ధత కూడా అవసరం లేదు . భావ వ్యక్తీకరణ ముఖ్యం . అలాగే నేను పేర్కొన్న కవితా పురాణం కూడా కోవ కి చెందినదే . 

లక్షణం :1. ఒక సమస్యను కవితా వస్తువుగా తీసుకుని , ఆ వస్తువును కవిత గా రాయాలి . ఇక్కడ కవిత  పద్య రూపం లో ఉంటుంది కానీ అది పద్యం కాదు . ఎందుకంటే, అది ఛందో బద్ధముగా ఉండదు. కాబట్టి దానిని పద్యరూపంలో ఉన్న కవిత గానే భావించాలి . 

పద్య రూపంలో ఉన్నా గానీ, దీనికి భావాన్ని ప్రకటింపజేసే పద్ధతిలో ప్రతిపదార్థం కానీ , లేక భావాన్ని కానీ లేదా రెండింటినీ రాయ వచ్చును , లేకపోతే కవితను మాత్రమే పద్యరూపం లో రాయ వచ్చును . కవి దానిని భావ యుక్తముగా, రాస్తున్నాడా లేదా అనేది ముఖ్యం . దీనికి ఛందస్సు అవగాహన లేని వారు కూడా రాయవచ్చును. ఈ రచనలు (కవితా పూరణలూ ) పూర్వ కవులు రాసిన పద్యాలను పోలి ఉంటుంది . దీనిని పద్యరూపంలో ఉన్న కవిత గా భావించి తెలుగు భాషా కళామతల్లికి ఒక మకుటంలో కలికి తురాయి గా వెలుగొందింప జేసే బాధ్యత, నవ కవులు , రచయితలు ముఖ్యంగా పాఠకులు , ప్రచురణ కర్తల పై కూడా  ఉన్నది . ఈ ప్రక్రియ సాహితీ ప్రియులకు హస్తభూషణం గా కూడా ఉంటుంది. ఉదాహరణ 1 : kavitha puranam 22.10.2018 

దత్త పాదం : "ఖర పాదార్చనమొక్కటే హితము కల్గన్ జేయుముమ్మాటికిన్"

పూరణ : 

జరా మరణము గల భక్తుల సృజనయగు జగజ్జననిసృష్టి కారకులైన

ప్పరమేశ్వరుని మనోవాంఛితులైన సుజనభక్త

పరమాణువుల నిశ్చలచిత్తచాంచల్య ము లేక బ్రహ్మమరయంగా

నర్ధనారీశ్వర దర్శనము నాకు నవవిధ భక్తిమార్గముల నరయగానాత్మయందే గల సోమశే

ఖరపాదార్చనమొక్కటే హితము కల్గన్ జేయుముమ్మాటికిన్ !

భావం : చావు పుట్టుకలు గల భక్తుల ను సృజియించినట్టి జగన్మాత , మరియు సృష్టి కారకులగు పరమేశ్వరుని యొక్క మనో వాంఛితులైనట్టి,మంచి భక్త జనులగు పరమాణువుల లాంటి వారైనట్టి ,చలనము లేనట్టి చపల చిత్తము లేక జ్ఞానమును తెలుసుకొనగా , ఆ అర్థ నారీశ్వరుని దర్శనము నాకు తొమ్మిది విధముల భక్తి మార్గములలో వెతకగా ,ఆత్మ యందె కల సోమశేఖరుని పాదములను అర్చించడమొక్కటే నాకు హితము ముమ్మాటికీ. అని కవితా పూరణము గల దత్త పాదము యొక్క భావము .

ఉదాహరణం 2 : కవితాపూరణం : 12 .09 .2018

దత్త పది : " కారము కన్నులన్ బడినన్ కల్గును మోదము మానవాళికిన్ "

పూరణం : 

స్వార్థము వీడిన సహాయము నన్ ,

సేవా తత్పరతన సక్రియా కర్మము నన్ ,

కృతజ్ఞుల పాలిటి కల్పవృక్ష మది(ధి) కారము

కన్నులన్ బడినన్ కల్గును మోదము మానవాళికిన్ || 

ఉదాహరణ 3 : కవితా పూరణం: 28.01. 2020)

దత్త పాదం : " మంచి వారల కెంచి చూడగా మంచి రోజులు రావులే "

పూరణం : 

ఇంచుక  స్వీయ కర్మలందుపరులకు సహాయమందించు సుజనులే 

సంచిత  పాప కర్మల నాచరించు కుజనులు చె డుత్రోవలోని వారలే  

పంచిన దుష్కర్మలను అనుభవించె డు సుజనుల జీవితపథమ్ముల 

నుంచి పయనించే మంచి వారలకెంచి చూడగా మంచిరోజులు రావులే || 

ప్రతిపదార్థము: 

ఇంచుక = కొంచెమైనా  ; 2. స్వీయ కర్మలందు = స్వంత పనులందు పరులకు = ఇతరులకు ; 4. సహాయము = ఉపకారము అందించు = చేయు    ; 6. సుజనులే = మంచివారే సంచిత = సంప్రాప్తించిన దుష్కర్మలను  ; ఆచరించు = చేసి ఇబ్బంది పెట్టేవారు  ; 9. కుజనులు = దురాత్ములు / దుర్మార్గులే  ; 10. చేదు త్రోవలో ని = చెడు మార్గములో పయనించు వారలే = వారే ; 12. పంచిన కుకర్ములు = వారి ద్వారా ఆచరింపజేసిన చెడు  పనులను  ; 13. అనుభవించెడు = ప్రత్యక్షంగా / పరోక్షంగా చేయించ బడినవారు  ; 14. సుజనుల = సజ్జనుల / మంచివారల ; 15. జీవితపథమ్ము ల = జీవిత మార్గముల నుంచి  ; 16. పయనించే = ప్రయాణం సాగించే ; 17. మంచి వారలకు = సుజనులకు  ; 18. ఎంచి చూడగా = వెతికి చూడగా / చూసినా కూడా  ; 19. మంచి రోజులు = శుభ దినాలు / మేలు కలుగు రోజులు  ; 20. రావులే = రాజాలవులే/ కనిపించవులే .భావం : కొంచెమైనా తమంతట తాము స్వతాహా ,స్వంతపనులతో ఇతరులకు సహాయము చేయు మంచివారే, సంప్రాప్తింపబడిన దుష్కర్మల ను ఆచరించే కుజనులను చేసి, ఇబ్బంది పెట్టే దుర్మార్గులు/ దురాత్ములే  వారిద్వారా ప్రేరేపించాపబడిన చెడు  పనులను ప్రత్యక్షంగా / పరోక్షంగా అనుభవించిన మంచి మనుషుల జీవిత మార్గముల నుంచి ప్రయాణం సాగించే సుజనులకు వెతికి చూసినా కూడా శుభ దినాలు / మేలు కలుగు రోజులు రాజాలవులే/ కనిపించవులే . అని భావం @@@@ 

 ఉదాహరణ 4 : కవితా పూరణం  24.12.2019 

దత్తపాదం:" దానము | చేయగా | గలుగు | దారుణ | వేదన | సజ్జనా | ళికిన్ "

పూరణం : 

పానము | చేయుచూ | ఈశ్వర | తలంపు| లో తప | ము చేయు | నెపమున్  

దానవేం | ద్రుని భ | క్తికి ము | దమంది| న యప్ప | రమేశ్వ| రుకరుణన్ 

తానొసం | గినవ | రముల | తో గర్వ | ముపొంది| నదాన | వరాజే  

దానము | చేయగా | గలుగు | దారుణ | వేదన | సజ్జనాళికిన్ 

వ్యాఖ్య: సుహృద్భావము తో చేయు సత్కర్మ ఎల్లప్పుడూసజ్జనులకు  శాంతి ని చేకూర్చును కానీ దుష్ఠ భావనతో చేయు సత్కర్మలు సజ్జనులకు వేదన కల్గించును .

భావము : సురాపానం చేయుచూ ,ఈశ్వరుని మదిలో కల్గిన తలంపు తో ,తపము చేయు కారణముచే, తపస్సును చేసిన దానవ రాజు భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు  తానొసంగిన వరములతో గర్వముపొందిన రాక్షస రాజే దానము చేయగా గలుగు దారుణ వేదన కలుగు మంచివారికి . ఏలనంటే  తాము అనుకున్న రాక్షస కృత్యము లనే అమలు పరచే పనుల నేపథ్యములో ఇది జరిగిందని నా భావము. 

సందేహం : నేను రాసిన భావం వేరు, మీరు వర గర్వితులైన రాక్షసులు కనక దానం చేస్తే వేదనలు కలుగుతాయి అని రాశారు, నేను దుష్టుల స్నేహం వలన వేదనలు కలుగుతాయి అని రాశాను, ఇంకొక్కసారి చూడండి - బహుశా నేను సరిగ్గా చెప్పలేకపోయానేమో. Krushna viraja 

వ్యాఖ్య : ఏ రాక్షస రాజైతే గర్వముచే దానముచేయుచున్న అప్పటికీ , తానూ అనుకున్న వికృత ప్రణాళికలను అమలుపరిచే సందర్భములో మంచివారికి కూడా నష్టము కలుగునని భావము. భావములో కూడా నేను చెప్పాను. అంటే ఫలితాన్నీ ఇచ్చే భగవంతుడు బేధభావాన్ని చూపించనప్పటికీ దాని adverse effects different గా ఉంటాయని భావం. అంటే మంచివారికి ఒకలాగా , చెడ్డవారికి మరొకలాగా అని అర్థం . 

సందేహం : aa raakshasa raaje daanamu cheyaga kalugu daanamu chesina manchivaariki " .. ee line meaning enti????? manchi vaaru daanamu chesina rakshasulu chesina phalithame vasthundana??? చిట్టా మైత్రేయి .

వ్యాఖ్య : ఇక్కడ దుష్టులే రాక్షసులు- ఇంకా రాక్షసులే దుష్టులు . వరగర్వితులు అంటే తమకు తోచిన పనులతో ఇతరులకు నష్టము కలిగించేవారు. తప్పక అర్థబలం, అంగబలం చూసుకొని విర్రవీగేవారని అర్థం . ఈ యుగంలో రాక్షసులంటే దుష్టులే అని అర్థం . kjk 

సందేహం : ithey ippudu manushulu daanam cheyyala ??? vadda??? చిట్టా మైత్రేయి . 

మానవులు సదుద్దేశం తో దానం చేస్తే, మంచి ఫలితాలను అందుకుంటారు . అంటే పాజిటివ్ approach చాలా మంచిగా ఉంటుంది.: kjk 

కవితా-పూరణం : 2.10.2019

దత్త పాదం : "మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో"

పూరణం : నిరాశా,నిస్పృహలు వలదనుచు ఘనముగా విజయపథమ్ములో

కోరిన,లక్ష్యములపయనించు నిరంతరముగా జీవిత గమనమ్ములో

విరబూసిన,జ్ఞాన సుమముల ఫలితములచే ఉద్యోగయత్నమ్ములో

మనిషికి మోదమిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో

వ్యాఖ్య : ఈ విధముగా చేసినచో కొందరు మనుజులు సంతోషముగా , అనుభవసారమును పొంది లక్ష్య సాధనలో కృత కృత్యులగుదురు .

                                                    .

కవితా పూరణం - 5.11.2019

దత్తఅంశాన్ని కవితా పూరణ వస్తువుగా తీసుకున్నాను . ఛందో బద్ధముగా ఉండకపోవచ్చు .

దత్త పాదం: " చలి కాలమున వడదెబ్బ చప్పున తగిలెన్ "

పూరణం : కలి ప్రభావమున ధర్మపత్ని కలకలముచే

చెలికాడు మృదు వచనములచే

వలపించి అనునయముగా సముదాయింపన్

చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్

వ్యాఖ్య : కలి ప్రభావముచే భార్య కలకలం వల్ల చెలికాడు/ భర్త మృదుమధుర వచనములచే

సముదాయించి నా కానీ చలికాలము న వడదెబ్బవలే చప్పున ములుకుల వంటి మాటలచే

మనసు బాధింప నెంచినదని నా భావము .          #####కవీశ్వర్

కవితా పూరణం 17.09.2019

దత్త పాదం : "వచ్చెను మార్గ శీర్షమున భవ్య వసంతము ధాత్రి నిండుగన్"

పూరణం :

  తెచ్చెను ప్రకృతి సుమశీతలాలంకృత సుందర దృశ్యంబున్

 ఇచ్చెను ఇలన్ శివకేశవులశ్రద్ధా విధి పూజాఫలంబు

 నచ్చెను ఆరాధనల ప్రేరణభక్త జీవిత గమనంబున్

 వచ్చెను మార్గ శీర్షమున భవ్య వసంతము ధాత్రినిండుగన్    ##### కవీశ్వర్

 

కవితాపూరణం : 09 .09 .2019

దత్త పాదం :" పడమటి దిక్కులో పొడిచే భానుడు గ్రుంకెను తూరుపు దిక్కులో "

పూరణం : 

కుడి ఎడమలు తారుమారై నీ విజయ పథంబున పయనించునట్టి

వడివడిగా ఫలితంబులుచూడ వైరుధ్యముఅందుఁ గా న్పించవట్టె

ఒడి బడిలో విజయ లక్ష్మిని చేరన్ డోలాయమానంబున నూ గ బట్టే

మిన్నున పడమటి దిక్కులో పొడిచేభానుడు గ్రుంకెను తూరుపుదిక్కులో

వివరణ : ఓ విద్యార్ధి కుడి ఎడమల పొరపాటుని గమనించి ముందడుగు వేస్తె నీవు నీ లక్ష్యాన్ని ఒడిదుడుకులు లేకుండా చేరుకుంటావు అని భావన.   @@@@ kaweeshwar


Rate this content
Log in