STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Action Classics Inspirational

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Action Classics Inspirational

నవ వధువు!

నవ వధువు!

1 min
338


నేను పుట్టినప్పటి నుంచి 

నా అల్లరిని భరించిన వారు

నా తెలివిని మెచ్చుకున్న వారు 

మొదటిసారి నా అందం గురించి 

మాట్లాడటం మొదలుపెట్టారు

నా అణుకువను ఆనవాలుగా చూపెడుతున్నారు

గారాబం చేసిన కన్నవాళ్ళే

ఆంక్షలు విధిస్తూ...

జాగ్రత్తలు చెబుతున్నారు.


ఇన్నాళ్లు అందరికీ నచ్చిన నేను

ఇప్పుడు వేరే ఎవరికో నచ్చాలట

నా ప్రవర్తన తీరు మార్చుకోవాలట

మూడు ముళ్ళ బంధంతో...

నేను మరో ప్రపంచం చూడబోతున్నానట

మెట్టెల సవ్వడితో మెట్టినింటిని మెప్పించాలట

తలుచుకుంటే...

కొంచెం ఇష్టం కొంచెం కష్టం లా అనిపిస్తుంది

ఒంటరినై వెళ్ళి జంటగా మారి

మరో తరానికి నాందిగా సృష్టి ధర్మాన్ని పాటిస్తూ

అనాది కాలపు కట్టుబాట్లతో...ఇల్లాలిగా జీవించాలట

ఇన్నాళ్ల నా ఆనందాన్ని ఆకాంక్షలను నాలోనే దాచుకుని

నన్ను నేను మరోలా ఆవిష్కరించుకోవాలి

అందమైన పెళ్ళి కూతురుగా ముస్తాబవ్వాలి.


శ్రీ...



Rate this content
Log in

Similar telugu poem from Action