STORYMIRROR

EERAY KHANNA

Action Inspirational Others

5  

EERAY KHANNA

Action Inspirational Others

" మేల్కొల్పు "

" మేల్కొల్పు "

1 min
290

       "  మేల్కొల్పు "     - రాజేష్ ఖన్నా

       ******************************

అభ్యుదయానికి, ఆరంభానికి 

ఆత్రపడవెందుకు సోదరుడా, 

ఆకలికోసం అలమటిస్తూ అడుగు కదిలించవెందుకు సోమరుడా,

అభాగ్యులైనా, అధిపతులైనా 

అడుగులేసేది ఆకలికోసం

అధికారానికి, ఆధిపత్యానికి లొంగని 

ఆకలి తిప్పినమీసం

కాలం ఆగదు, కష్టం తూలదు,

కన్నీల్లొక్కటే కలకాలం 


సోకులకోసం సోమరివై మింగుతున్నావ్ హాలాహలం

మతాల, కులాల మనుగడకోసం దేనికి రాక్షసానందం

మతిలేని, గతిలేని గమ్యాలకోసం పోగొట్టుకోకు

 నీ  యవ్వన సుగంధం 

 జాతికుక్కలు, నీతిలేని నక్కలు మొరుగుతుంటే

 నీ జీవితంపై ప్రీతిలేకా గాలికి నీవు తిరుగుతుంటే

 నిష్కారణంగా, నిర్లక్ష్యంగా నీ దేహం,  దేశం 

 నడి వీధిలో మిగిలాయి


 నీ పద్ధతి నచ్చకా, నీ జీవితాన్ని మెచ్చకా ఎన్నో హృదయాలు కోపంతో రగిలాయి 

మనుషులు మహానటులు, మైమరిచి వాళ్ళని చూడకు

నీవు వాళ్లకు నిరుపయోగమైతే నీ చితి పేర్చిపోగలరు

గతిలేకా, గత్యంతరంలేకా జేజేలు కొట్టకు

నీ హక్కుల్ని, నిన్ను అమ్మేస్తూ ఏమార్చిపోగలరు 

నీకు తెలిసిన జీవితాన్ని అనుభవించు

నీకు అందిన అవకాశాన్ని ఆనందించు

పోలికకి పోయి పొందినదాన్ని పోగొట్టుకోకు

తర్కానికి పోయి నీ జీవితాన్ని తగలెట్టుకోకు 

యవ్వనం కదిలివ్వగా వెళ్ళు కంటికందినంతా దూరం


కవనం బదులివ్వగా చూపించు నీవు సాధించిన తీరం

వ్యక్తిగా , ఓ శక్తిగా నీ భావితరాలకందించు ఓ వరం

సహనంలేని వ్యసనంతో ఆడకు అబద్దాల బేరం


RK✍️✍️✍️✍️


 


 


 


 



Rate this content
Log in

Similar telugu poem from Action