కరోనా వచన కవితా సౌరభంకవీశ్వర్
కరోనా వచన కవితా సౌరభంకవీశ్వర్


సంతోషముగా సాగెడు మన జీవన పథమ్ము లో
సుడిగాలి లో సూక్ష్మ క్రిములుద్భవించే చైనాలో
సంసార గతిని మార్చేసే కరోనా తన చేతలలో
సర్వము తుడిచిపెట్టేసే వికలముగా మానవులలో
అవరోధమైన ప్రక్రియలనివారించే ప్రపంచ ప్రగతిలో
అవకాశముల కొఱకే సకల జనుల జీవన పథమ్ములో
అక్కఱకు రాని చేతలతో వారిని పడవైచె కష్టములలో
అవసరమయ్యే శిష్టాచారముల నే వారి ఆరోగ్య వరదానములలో
కరిగించిన ఆశల కలలందు విహరించే వారిలో
కట్టించిన ప్రయత్నఅలలలో పయనించే వారిలో
కఠిన నియమాలను క్రమంగాఅనుసరించే జనులలో
కరుణించును ఆరోగ్య సంక్షేమము రోగనిరోధకతలో
"జీవన చక్రమును సమాప్తము చేయవచ్చు - ప్రారంభమును కూడా స త్ పద్ధతులచే ఉద్ధరించనూ వచ్చు"