STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Inspirational Others

4  

Thorlapati Raju(రాజ్)

Action Inspirational Others

బిడ్డా మర్చిపోవద్దు...

బిడ్డా మర్చిపోవద్దు...

1 min
84

బిడ్డా! మర్చిపోవద్దు...


ఓ దినాన..

మా ఇంట్లకి..

ఓ ..చుట్టమొచ్చిండు


గరే...

చుట్టం గందా అని

మంచిగ మర్యాద సేసినంలే!


గిలా..గా చుట్టం

ఒకటి..రెండు..మూడు గాదు

30 దినాలున్నడు..మా ఇంట్ల


ఓ..దినాన..

మంచిగా సినిమా సూస్తుంటే

TV రిమోట్ లాక్కున్నడులే..

ఏందో FTV అంట పెట్టుకుండు


గా సంది మొదలైంది రా భయ్..

గింక ..ఏ దినము..

నా రిమోట్ నా చేతిల లేదు!


నా ఇంట్లకొచ్చి..

నా సొమ్ము తింటూ..

నా వన్నీ లాక్కుంటుంటే..

దీం..తల్లి !

మస్తు కోపమొచ్చిందిలే..


గా దినము 

యాదికొచ్చింది..


గా తల్లదొర నా యాళ్ళు

నా భారతదశాన్ని..గీ విధంగానే..

200 యేళ్ళు లాక్కొండ్రుగందా అని!


గీ దినం..

మనమింత సక్కగున్నా..మంటే!

ఎంతమంది పాణాలు ..

బలి సేసుకుండ్రో..


యాద ఉంచుకొండ్రీ..బిడ్డా ..

మరిసిపోవద్దు.

         ....రాజ్.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action