STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

బోగి మంటలు

బోగి మంటలు

1 min
378

బోగి మంటలు!


పట్టుకు రండి..

పట్టుకు రండి..


విరిగిన కుర్చీలు..

పాత పట్టి మంచాలు...

ఎండిన కంపలు..

మన దారికి అడ్డొచ్చే తుప్పలు..


పట్టుకు రండి..

పట్టుకు రండి...


మన మనసులకు పట్టిన

మట్టి మలినాలు..

కామ క్రోధాలు...

దురాశ దుర్నీతులు..

అవినీతి అత్యాశలు..


వేసేయండి వేసేయండీ..

ఈ బోగి మంటల్లో వేసేయండి!

ఆ మంటల వెలుగులో...

మన జీవితాలు కొత్తగా వెలగాలి!

ఆ మంటల వెచ్చదనం..

మనలో కరుడు తనంను కరిగించాలి!

ఆ మంటల కాంతి..

రేపటి సంక్రాంతికి దారి చూపాలి!


       ......రాజ్.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action