శ్రీ గురు గీతం - కవితా సౌరభం
శ్రీ గురు గీతం - కవితా సౌరభం


అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం 05.10.2020
సందర్భంగా ఈ కవితా గీతం : కవీశ్వర్
పల్లవి : ఓనమాలు దిద్దించే గురువులండి వారు
తల్లిదండ్రులే కాక ఇంకెవరండీ వీరు || 2 ||
చరణం : 1 : జీవితాన్ని సృజియించె జ్ఞాన పాఠం చూపారు వారు
విజ్ఞాన పథంలో చుక్కాని వంటి మార్గమండీ వారు
జన పథాన వెలసినట్టి ఆ చుక్కానే ఈ గురువు గారు
ఆ గురువుల ననుసరించి పయనించే శిష్యులండి వీరు
|| ఓనమాలు ||
చరణం : 2: మేస్రోప్ మెష్ టాటస్ జ్ఞాపకాల సరళి తో
అర్మేనియా అక్షరమాల సృష్టించిన కృషితో
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ అనుసరణతో
బహుముఖ ప్రజ్ఞాశాలి జీవన శైలి గమనము తో
|| ఓనమాలు ||
చరణం : 3: విశ్వ గురువుల బోధనల ఉత్ప్రేరణమండీ
ఆధ్యాత్మిక గురుదేవుల మార్గదర్శనమండీ
గతించిన గురువుల మనః స్మరణ మార్గమండీ
సాంకేతిక ప్రయోగాల అనుసరణమే లక్ష్యమండీ
|| ఓనమాలు ||
కే. జయంత్ కుమార్