STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Action Classics

5  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Action Classics

నీ కనుపాపనై !

నీ కనుపాపనై !

1 min
371


ప్రియా.. 


నా వలపు వాకిట్లో నువ్వు నిలిచి, 

నీ గుండె గూటికి నే చేరిన క్షణం.. 


శిశిరం తర్వాత వచ్చే హేమంతం లా 

నా జీవితంలోకి ఆమనిని తోడు తెచ్చావు.. 


సాయంకాలపు వేళల్లో.. 

నా మదిలో సంద్యారాగాలు పలికించావు.. 


ఆకాశమంత నిర్మలమైన నీ జీవితంలో 

నన్ను రంగుల హరివిల్లును చేసావు. 


నీ దోసిళ్ళలో ప్రేమను పట్టుకొని

నా ముందు ప్రత్యక్షం ఐన 

నా కలల రాకుమారుడివి నువ్వు.. 


నీ కంటికి కావాలి కాచే కనుపాపనై 

ఉంటాను నీ తోడుగా... 

కలకాలం.... నీ నేనుగా... 


శ్రీ.... 


హృదయ స్పందన.. 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action