STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

The Book!

The Book!

1 min
360

పుస్తక దినోత్సవం సందర్భంగా


మస్థకాన్ని...

చైతన్య పరిచి

నిత్యం వెలిగించే అఖండ జ్యోతి 

పుస్తకం.📖

మనసుకు స్వాంతన కలిగించే

ఆత్మీయ నేస్తం...పుస్తకం📕

మానవుని

అనుభవాల అల్లిక....పుస్తకం

జ్ఞాపకాల దొంతర.....పుస్తకం


ఓ... పుస్తకమా...

నీ చేతి చలవ వలన

బురదలో నుండి కమలం వికసించినట్టు

కమ్ముకున్న కారు మబ్బులును..

రవి కిరణాలు చెల్లాచెదురు చేసినట్టు


ఎందరో...

కటిక దరిద్రులు...

కనకమును సొంతం చేసుకున్నారు...

మరెందరికో...ప్రేరణ గా నిలిచారు!


ఎందరో...వికలాంగులు...

తమ వైకల్యాన్ని జయించి..

విజయాన్ని సొంతం చేసుకున్నారు

అన్నీ ఉన్న ఎందరికో..ఆదర్శంగా నిలిచారు!


యెన్నో ఒంటరి బ్రతుకులు..

నీ సాన్నిహిత్యం లో..

నిజమైన మనోబలాన్ని పొందాయి!

యెన్నో వేసారిన హృదయాలు...

అమితమైన..ఆత్మీయ ఆనందాన్ని పొందాయి!


ఓ పుస్తకమా...

నిన్ను స్పృశించిన రోజు నుండి

ఆనందమంటే తెలిసింది

అందరితో కలిసి ఉండటం తెలిసింది

స్నేహ బంధం అల్లుకుంది

ప్రేమ పుష్పం చిగురించింది


ఓ పుస్తకమా...

నీ చల్లని నీడలో

విలువలను వరించాను

వినయాన్ని వెంట తెచ్చుకున్నాను

పట్టుదలను పుణికి పుచ్చుకున్నాను

నిరాశలో..ఆశను వెతికాను

నిశీధిలో...నక్షత్ర మాలనయ్యాను


ఓ... పుస్తకమా

నీ స్నేహ మాలికలో..

మొత్తంగా..మానవుడుగా

జీవించే ప్రయత్నం చేస్తున్నా...


అందుకే... ఓ పుస్తకమా..

అందుకో...శాష్టాంగ ప్రణామం!


      .......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Action