STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

వాస్తవ భారతం!

వాస్తవ భారతం!

1 min
370

వాస్తవ..భారతం!


కూటి కోసం కోటి పాట్లు పడే...

కోట్ల మంది ఉన్న మన దేశంలో..

పరువు హత్యకోసం..

కోటి రూపాయిల సుఫారీ ఇచ్చే..

ధర్మ పభువులున్నారు!


పిచ్చి ప్రేమతో..

కుల మతాలకు అతీతంగా

ఒక్కటవుతున్న యువతన్న మన దేశంలో..

కులం మతం అంటూ..

పిచ్చెక్కి ప్రాణాలు తీసే..

కుల ప్రేమికులున్నారు!


సోది కబుర్లు చెప్పుకునే..

సెల్ ఫోన్ కంపెనీ బాబులకు

అప్పులిచ్చి మారీ..ఆదుకొనే

ప్రభుత్వాలున్న మన దేశంలో..

అన్నం పెట్టే రైత్నకు మాత్రం

రక్త కన్నీరు చూపిస్తాయి


ఏది ఏమైనా..

భారత దేశం..

అత్యంత సహన శీలి అనటంలో..

యే మాత్రం అతిశయోక్తి లేదు!


ఒకప్పుడు...

భరత మాతను 

బయటవాల్లు నానా బాధలు పెట్టీ

బందీ చేసి లూటీ చేసి పోయినా...

నేడు..

తన పిల్లలే..తనని

నానా..హింసలు పెట్టీ

హసించి...హాలాహలం చిమ్మతున్న...

ఎంతో..సహనం తో..

మనకు.. అన్నీ సమకూరుస్తుంది

చూడండి...

దానికి మాత్రం...

మేరా భారత్..మహాన్!


      ......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy