కిట్టయ్య...
కిట్టయ్య...
......కిట్టయ్య....
నల్లనయ్య...
నీ...మనసెంత తెల్లనయ్య!
పుడుతూనే..
కట్టాల పాలయ్యినవంట!
అమ్మ అయ్యలకి దూరమయ్యినవంట!
నిన్ను సంపేందుకు..
కంసుడు కాపు కాసిండంట!
పాము పడగ పై ఆడినవంట!
సిటికనేలుతో కొండనెత్తినవంట!
భార్యలకోసం...
ఎన్నో యుద్ధాలు సేసినవంట!
చందరయ్య సేత ...
నిందలు పాలయ్యినవంట!
ఆ పాండవుల కోసం..
నానా పాట్లు పడినవంట!
గాంధారమ్మతో...
శపించ బడినవంట!
అయినా...
నాకు తెలవక అడుగుతుంట!
యెన్నో...
బాధలు..
నిందలు...
పాట్లు..పడినవ్ గంద..
అయినా...
నీ చిత్తం చెలించకుండ..
గెట్ల ఉన్నవయ్యా....?
ఎన్నడూ ...
నీ మోము లో...
చిరునవ్వు తప్ప... చిరాకే కనబడలేదంట!
ఓ..కిట్టయ్యా...
ఎంత కట్టమొచ్చినా...
చెదరని... నీ చిరనవ్వు...
మాకు అందియ్య వయ్యా...
.... రాజ్.....