జలకమాడిన సరసులో..
జలకమాడిన సరసులో..


జలకమాడిన సరసులో జన్మమే సాఫల్యమేలే
అలకవీడిన సరసంలో సాగిలైనా వైఫల్యమేలే
కోరికలే కోటివింతల నాట్యమై కోరి నర్తించునే
తారకలే తళుకు మరిచి తల్లడిల్లి ప్రవర్తించునే
ఎదలు రెండు ఎరుక మరిచి పొదల చాటునా
మొదలుకాని సమరంలో మోదం అలవాటునా
జలకమాడి సరసులోన జన్మమే సాఫల్యమేలే
అలకవీడి సరసంలోన సాగిలైనా వైఫల్యమేలే
నీలి కళ్ళ చూపుతో నీలిమేఘమై కరిగించునే
సోలిపోయే పొద్దులో తొలిరాగమై కవ్వించునే
గుచ్చిన చూపుల గురుతులే ఇంకామానలేదు
మెచ్చిన వలపుల వసంతం అదీను కానలేదు
గుండెలోన గుబగుబలు గురి తప్పనున్నాయి
ఉండలేని మనసు ఉరవళ్ళు తప్పుకున్నాయి
జలకమాడి సరసులోన జన్మమే సాఫల్యమేలే
అలకవీడి సరసంలోన సాగిలైనా వైఫల్యమేలే
ఎదలు రెండు ఎరుక మరిచి పొదల చాటునా
మొదలుకాని సమరంలో మోదం అలవాటునా
కలలు కొన్ని కలవరమే పెంచి కనికరించవులే
అలలు అన్ని తీరమే చేరి మరి కనిపించవులే
ఎడారి వెన్నెల కాకూడదు ప్రేమలో ఆ పెన్నిధి
తడారి వన్నెలు తలవంచక నిలవాలి సన్నిధి
కలలు కొన్ని కలవరమే పెంచి కనికరించవులే
అలలు అన్ని తీరమే చేరి మరి కనిపించవులే
జలకమాడిన సరసులో జన్మమే సాఫల్యమేలే
అలకవీడిన సరసంలో సాగిలైనా వైఫల్యమేలే
జలకమాడిన సరసులో జన్మమే సాఫల్యమేలే
అలకవీడిన సరసంలో సాగిలైనా వైఫల్యమేలే