STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

An old man!

An old man!

1 min
360

ఓ..ముదుసలి!


ముడతలు పడిన మడతలతో..

మడతలు పడిన మమతలతో

మమతలు పంచని మనుషులతో...

కలిసి ఉండలేక...

విడిచి బతకలేక..

ముందుకు సాగలేక...

ఆయువును ఆపలేక..

అడుగులో...అడుగులు కూడా

వేయలేని....ముదుసలిని నేను!


నా జీవితమంతా...

నీ కోసం..

మీ కోసం..

నా శ్రమను.. మీ సంతోషంగా 

నా బాధను..మీ బాగు గా

నా కష్టాన్ని..మీ కలిమి గా

భావించి...బ్రమించాను


ఈ రోజు..

ఎక్కడ చూసినా...

వయసుడిగిన..మనుషుల

మానసిక...శారీరక హింసలే

కళ్లకు కనబడుతున్నాయి!


మనిషి స్వేచ్ఛ... తల్లిదండ్రులను..మర్చిపోయేలా 

చేస్తుంది..

మనిషి స్వార్థం...

తమ పిల్లల ఆలనా పాలనా..

చూసే వరకు grand parents..

తర్వాత..

వేరెవరో మనకు తెలియని.. పేషంట్స్!

అన్నంత వరకు...ఉంది!


ఒకరోజు..

మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు!


అవును పాపం 

వాళ్ళు మాత్రం ఏం చేస్తారు!

రోజు చక్కగా.. మాకు

టైం కి టిఫిన్ ఇచ్చి..

టాబ్లెట్ ఇచ్చి..

మధ్య...మధ్యలో..

టీ..లు.. కాఫీ లు ఇచ్చి..

మధ్యాహ్నం..భోజనం ఇచ్చి..

సాయంత్రం మళ్లీ..

టీ..స్నాక్స్ ఇచ్చి...

రాత్రి కి మళ్లీ..టాబ్లెట్స్ ఇచ్చి...


ఎంతో చక్కగా చూసుకుంటున్నారు..

కానీ!

మేము ..

మా వార్ధక్యం తో..

మతి మరుపు తో..

చాదస్తం తో..

ఇంకా...వాళ్ళని

ఏదో ఒక మాట అంటూ

అది చెయ్యి ఇది తెచ్చు..

అంటూ...

ఎక్కడికి వెళ్లారు రా..

ఇంతవరకు..ఎందుకు..అని

ప్రశ్నలు వేసి విసిగించి...


వారికి మాపై..

వెగటు వచ్చేలా చేసాము

ఏం చేస్తాం మీ తప్పు లేదు!


కానీ!

మీరు మమ్మల్ని చూసే

పది లేదా..పదిహేను సంవత్సరాలు

చాలా కష్టపడుతున్నారు...

మరి

మిమ్మల్ని...చూసిన

20 లేదా..25 సంవత్సరాలు

అంతకు మించి కష్టపడ్డాము


ఒక్కటీ అందరూ గుర్తించాలి!

మాకు వయసుతో వచ్చిన

మతిమరుపు చాదస్తం వల్ల

మేము.. మాకు తెలియకుండా

బాధిస్తున్నాము..

కానీ!

మీకు జ్ఞానం ఉండి..

జవసత్వాలు ఉండి..

నిర్లక్ష్యం తో...బాధిస్తున్నారు


నిజంగా.. ఆ దేవుడికి

మేము ధన్య వాదములు చెప్పుకోవాలి

మిమ్మలిని పెంచే క్రమం లో..

మాకు ఎటువంటి ...

చిరాకు..విసుగు..విరక్తి

కలిగించలేదు...


లేదంటే..మేము కూడా

మీలా..ఏదో ఒకరోజు...


జీవితం...

ఒక చక్రం అన్నది..

ఎవరమూ..మర్చిపోకూడదు!


    ......రాజ్....







రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy