Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Abstract Action Inspirational

4.5  

jayanth kaweeshwar

Abstract Action Inspirational

కాల చక్రం -: సమయం : వచనకవితా సౌరభం

కాల చక్రం -: సమయం : వచనకవితా సౌరభం

1 min
374


కాలచక్రం : సమయం - వచన కవిత ( prompt - 4 )

కాల చక్రమునకు ఇనుండు ఆది దేవుండు 

బ్రహ్మవిష్ణుమహేశ్వరుల సంయోగ రూపంబు 

సమస్త ఘటనా - సంఘటనా ప్రత్యక్ష సాక్ష్యంబు 

ఏసమయానికి ఏమి జరగాలో -జరిపించే దినకరుండు.


సకల జీవులు చేయు కర్మలకు సాక్షిభూతుఁడు

ఎవరు మంచిచేసినా - చెడుచేసినా -

అందరికీ మేలే చేసే ఘనుఁడే 

ఏజీవి అయినా వాటి ఆయుప్రమాణముననుసరించి 

తనదైన ముద్రను వేసేవాడు .


సమయాన్ని అంచనా వేయడంలో ఘనాపాటీలం కాదు మనం 

భూత ,భవిష్యత్ - వర్తమానాలు కాలానుగుణంగా తెలిపేదే సమయం 

వర్తమాన కాలాన్నే ప్రామాణికంగా తీసుకుని మన మంచి క్రియలను జరుపుతాం 

గడిచిన కాలాన్ని-జరిగిపోయిన పనుల్నివెనక్కి తీసుకరాలేంమరలా ఉపయోగించలేం 


బ్రాహ్మీ ముహూర్తాన నిదుర లేస్తే మన జ్ఞాపకశక్తి , ధారణ శక్తి అధికమౌతాయి 

మనం చేయవలిసిన సుకర్మలను ప్రణాళికాబద్ధంగా జరుపుకోగలం 

ఫలితాలు సహేతుకంగా లభించినప్పుడు అదృష్ఠముగా భావించేవారు 

అలా జరగకపోతే దురదృష్టం గా కూడా భావిస్తారు కొందరు. 

వ్యాఖ్య : "సమయాన్ని కాలానుగుణం గా సుకర్మలకు సద్వినియోగమైతే - అదిఅందరి ప్రగతికి శుభసూచకం"

    #### కవీశ్వర్ జయంత్ కుమార్  


Rate this content
Log in

Similar telugu poem from Abstract