అద్భుత దీపం - కలల సాకారం వచన కవిత
అద్భుత దీపం - కలల సాకారం వచన కవిత
అద్భుతదీపం - కలల సాకారం వచన కవితా సౌరభం : కవీశ్వర్ ( Prompt - 5 )
పిడికిలంత గుండెలో - సంద్రాన్ని మించిన ఆశలు
మనసంతా నిండే - అమలుకై క్రొత్తక్రొత్త కోరికలు
ప్రయత్నించినా తీరనిచో - చెలరేగెను నిరాశలు
తీరినవేళ కలిగెను మనకు - ఆనంద హే లికలు
అద్భుత దీపమ్ము దొరికె లే - తృటిలో తీరును కామనలు
వానికి పెరిగెను గర్వమ్ము - దర్పమ్ము ఇంకా సోమరితనములు
కన్నుకుట్టి పెరిగిరి స్వార్థముతో - చిటికెసినంతలో అరులు
భయముతో జీవించసాగె - తోచకపాయె రక్షించుకొన సిరులు
ఆతను తలచినచో - కష్టార్జితకలిమి ఉందును ఎక్కువ కాలాలు
కరిగిపోవును తింటూ కూర్చున్న - కొండలంతఉన్న సిరులు
రక్షింపనెంచ సంపదను తెలివితో - దయార్ద్ర హృదయులై,పొదుపరులై
అట్టివాడే బలవంతుడు , ధీమంతుడు గుణవంతుడు ఈ యుగములో
వ్యాఖ్య : " అదికూడా ఆతని కర్మలు, గుణాలు , ఆలోచనలు పెడదారి పట్టనంత వరకే ."
కవీశ్వర్ జయంత్ కుమార్ - 05.05.2021
