STORYMIRROR

Sandhyasharma yk

Action Inspirational Others

4  

Sandhyasharma yk

Action Inspirational Others

నేను

నేను

1 min
331

*నేను*

౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪

ఎక్కడో 

నన్ను నేను కోల్పోతున్న దృశ్యం

అసంకల్పిత చర్యల్లో 

రేపగలు ప్రతీకార జ్వాలల్లో

మగ్గుతూనే వుంది...

రణగొణ ధ్వనుల మధ్య

రాపిడిలో తేలిన నల్ల రాళ్ళకు మల్లే

రాబందుల రెక్కల చప్పుళ్ళకు

రాటుదేలిన రేగు ముల్లల్లే

గుచ్చుతూనే వుంది....


అహం బీజంలో

ఆత్మ చిత్తాన్ని తలదన్నేలా...

ముంగారు పంటలో

మబ్బుపట్టిన నగిషీలను

తాకట్టు పెట్టి తాయిలాలకు

దాసోహం చేసే యత్నాల్లో

ప్రతిఫలాపేక్షలో ప్రత్యామ్నాయం లేని

పెట్టుబడికి సన్నాహ పన్నాగాలు...

పన్నుతున్న విష కోరలు...

బుసుకొడుతూనే వుంది...

నిర్భేద్యాల నడుమ

నిస్సంకోచాలకు తావులేక

నాగరికత అంచుల్లో

విషయవాంఛ లేని 

అజ్ఞానాన్ని పండిస్తూ

మేథో మథనాన్ని 

నిర్వీర్యం చేసే నరబలుల వేటలో

జక్కన శిల్పాలు

ఛిద్రమవుతూనే వుంది...


నాలుగ్గోడల చప్పుళ్ళు

నడివీధిలో అమ్ముల పొదిలోంచి 

సంధించే బాణాలై బతుకు

పట్టాలు తప్పిస్తున్నా...

కుతంత్రపు కుంపట్లతో

నమ్మలేని నిజాల మధ్య

బాల్యపు చలిమిడిలెన్నో

నలిగిపోతూ నిరంతరం

నరకపు ద్వారాలను

ఆహ్వానిస్తున్నాయి...

అడుగడుగునా సంకుచిత భావమే

వేళ్ళూనుకుపోయి... 

సమాంతర రేఖల పొదుగులో

నిలువుగీతల చారికలు

తెరలుతెరలుగా వర్షిస్తున్నా

ఎండమావుల్లో ఎదగలేని

కలుపుమొక్కై ప్రాణవాయువునిచ్చే

ఆయుధంగా....

రేపటి వెలుగు నీడల్లో 

నడిపించే.. యంత్రమైనా

నడవాల్సిన దారిని

నిక్కమై నిలువుటద్దంలో

పరిశోధించాల్సిన తీగను

అనుసరిస్తూ....

నన్ను నేను ఏ మలుపులో దాగున్న

గెలుపు పిలుపుకో

ఊతమిచ్చే పచ్చని పాలరాయినై 

నాల్గక్షరాలు చల్లుకుంటూ

నలుదిక్కులా విస్తరించి

వెన్నెల రువ్విన విశ్వశాంతికి జీవం పోస్తా....!

*****(******

వై.కె.సంధ్యశర్మ✍️


Rate this content
Log in

Similar telugu poem from Action