గుడి గంటలు!
గుడి గంటలు!
********************
సడి సేయకనే
నా హృదిలో రేగెనే
నీ యదపై వాలాలనే
జడివానలా
జత కలిపే తొలిప్రేమ
పరవశంతో మ్రోగెనే
నా మదిలో గుడి గంటలా!
కలువ కనుల కాంతి రేఖలతో
విరజిమ్మెనే కోటి కాంతులు
ప్రణయ సౌరభను మెప్పించ
పండు వెన్నెలను తలపించ
నా మదిలో మ్రోగెనే గుడి గంటలా!
సలిల తలపులతో
సొగసు మధురిమలతో
ఆదమరువని ఆమనిలా
అలుపు లేక అవనితానై
మురిపించ నా మదిలో
మ్రోగెనే గుడి గంటలా!
ఎదురు చూపుల జావణీ
ఎండమావులు ఇక లేవని
ఎంకి పాటలా ఎల గోదారి
సొగసు వన్నెలా
వలపు గీతిలా
నా మదిలో మ్రోగెను
గుడి గంటలు!