Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandhyasharma yk

Abstract Drama Others

4  

Sandhyasharma yk

Abstract Drama Others

ఎదురు చూస్తుంటాయి

ఎదురు చూస్తుంటాయి

1 min
380



ఎదురు చూస్తుంటాయి.!



బతుకు తెఱువు


జాడలో...


పొలిమేర దాటిన


ఆ పాదాలెపుడూ


కఠిన శిలలే


ఎర్రమట్టిలో


పండిన పంటకు


గిట్టుబాటు చూడలేని


ఆ కళ్ళకెపుడూ


అశ్రుధారలే...


కుమ్మరి కుండలో


ఆకలి మంటలు


చల్లార్చలేని


ఆ చేతులెపుడూ


బంధీలే.....


రేవు నిండినా


కడుపు నింపుకోలేక


మనుషుల


మురికి తొలచలేని


ఆ మనసులెపుడూ


దివిటీలే...


ఏ ఆపన్న హస్తమో


ఆదమరచి


ఆదుకుంటుందనో....


కన్నవారి కలలకు


కానుకగా


ఓ తీపి కబురో


మా పల్లె జల్లెట్లో


జాలువారుతుందనో


ఎదురు చూస్తుంటాయి


గుండెల్లో గొంతుక నింపుకుని!





Rate this content
Log in

Similar telugu poem from Abstract