STORYMIRROR

EERAY KHANNA

Drama Action Inspirational

5  

EERAY KHANNA

Drama Action Inspirational

" కులంపై నా గళం "

" కులంపై నా గళం "

1 min
357

       " కులంపై నా గళం " - రాజేష్ ఖన్నా

           ==========================

జీవమున్న ప్రతీది కుళ్లిపోవాల్సిందే

కుళ్ళిపోయినా ప్రతీది మట్టిలో కలవాల్సిందే

మట్టిలో కలిసింది మళ్ళీ పుట్టాల్సిందే

విత్తనమైతే చావకుండా మళ్ళీ పుడ్తుంది

విషమైతే మట్టినే చంపేస్తుంది

విషయమేదైనా రూపాంతరం చెందాల్సిందే

మనసుతోపాటు మనిషి మారాల్సిందే

మారిన మనిషికి జీవితం మారాల్సిందే 

మనసు అంతరాలల్లో చేరిన కులం మారిందా?

కులాన్ని కుళ్లబొడిచి కాళ్ళిరగొట్టినా

అవిటితనాన్ని సహితం దాచుకొని

మనుషుల బలహీనతలపై దాడికి కాచుకొని

వేరుచేసి వెర్రివాళ్ళని చేసి ఆడుకొనే

కులానికి కుటీరాలు కట్టేవాళ్లు మారాల్సిందే

గాలిదూరనిచోటికి సహితం దూరిపోయిన

కులం నడిచిన దారుల్లో పారిన రక్తపుటేరులెన్నో

కులం నడిపిన నాటకంలో నలిగిన నగ్నపాదలెన్నో

కులం చిచ్చురేపగా చిరిగినా బ్రతుకుతెరలెన్నో

తాను తాజాగా ఉండి మనసుకి మట్టిపూస్తుంది

భావాలకు కరగని మనసులో విత్తనం వేస్తుంది

కులహంకారపూరిత పురిటినొప్పులు మనలేకా

కులం రంగుతో కుళ్లిపోయిన బిడ్డల్ని కనలేకా

సమాజం సొమ్మసిల్లిపోగా ఊరుకొని కులం

ఉప్పెనలా విరుచుకుపడి బరిసెతో పొడిచింది

బలవంతంగా పైకిలేచిన సమాజం కులంవెంటా

కుంటుకొంటూ అడుగులేస్తూ నడిచింది

తాజాగా పుట్టే ప్రతిదీ కుళ్ళిపోతోంది కదా

కూకటివేళ్ళతో సహా కులం ఒక్కసారైనా కుళ్లిందా

శవాన్ని కుళ్ళకుండా బ్రతికించే రసాయనంలా

మనిషి రక్తంలోని మూర్ఖత్వమే బ్రతికిస్తోంది

కులాన్ని కరువుకాటాలేమి చెయ్యట్లేదు

కఠినమైనా విధానాలు సహితం ఏమి చెయ్యట్లేదు

మరీ కులం కుళ్ళిపోవడానికి మందేడున్నది

కులం దేన్నైనా ఆకర్షిస్తుంది

బాధపెట్టి భయపెట్టి నన్నొకవైపు

ఆలోచన చేసిన నా కలాన్ని ఇంకోవైపు

అర్దాకలితో మిగిలిన నా అక్షరాల్ని మరోవైపు

దేన్నైనా తన అలవాటు ప్రకారం

మభ్యపెట్టి, మనసుదోచి ఆకర్షిస్తోంది

మరి కులాన్ని కుళ్లించే శక్తి నా కలానికైనా

కులంపై ఎత్తిన నా గళానికైనా ఉందో లేదో

  

              ***** సమాప్తం*****



Rate this content
Log in

Similar telugu poem from Drama