నూతన సంవత్సరానికి స్వాగతం
నూతన సంవత్సరానికి స్వాగతం
వచ్చిందండోయ్
మన ముందుకు మరో... కొత్త వత్సరం
ఏదేదో...సాధించాలి
ఎన్నో నిర్ణయాలు తీసుకునే మరో అవకాశం తెచ్చింది
తేదీల అంకెలు
మారేది
నీ జీవితంలో ఏం మార్పు తెస్తుంది
అనుకుంటున్నవ్ లే...
అది మార్చకున్న
నీలో ఉందే...
ఇకపై మారుతుంది అనుకునే నీ సంకల్పమే... మార్చుతుంది నీ స్థితిని
మై డియర్ గతం
నీకు థ్యాంక్యూ చెప్పాల్సిందే ప్రియా
ఎన్ని సూపించినవ్...
ఎన్ని నేర్పించినవ్...
మంచో...చెడో
ఆనందమో...విషాదమో
నాకు మాత్రం అనుభవాన్ని మిగిల్చినవ్...