యథార్థ ఆక్రందన
యథార్థ ఆక్రందన


ఈ అవనీతి అయ్యంది ఇక వదలని వ్యసనం,
సదాచార సత్యవచనం అయ్యెను ప్రహసనం,
ఏమి వర్తిచటం లేదు రాజ్యాంగం శిలాశాసనం,
దుర్జన దుశ్శాసనుల సుడిలో ఉంది ప్రశాసనం ।౧।
ప్రసార మాధ్యమాలు చేసెను అబద్ధాల ప్రచారం,
ప్రాథమిక అధికారాలు అయిపొయెను మటుమాయం,
ఆగిపోయెను నైతిక విలువల ప్రయోగం ప్రయోజనం ,
ఉండదు విదురుని నిష్పాక్షిక సిద్ధాంతాల ఉపయోగం |౨|
ప్రజా ప్రతినిధులకు దుర్నీతి అయ్యెను విన్యాసం,
నిర్మాణాత్మక విమర్శలలో కనిపించెను వ్యత్యాసం,
ఈ విధ్వంసక పరిస్థితి ఎంతవరకు ప్రశంసనీయం,
ప్రజాస్వామ్యం మార్గం అయ్యెను ఇక అగమ్య గోచరం ।3।
ఇది కేవలం కాదు ఒకరి ఆర్తనాదం ఆవేదన ,
అయ్యంది క్రూర నియంతకి అధికార దీవెన,
ప్రజలు శాస్తి పొందారు చేసి సమ్మతి నివేదన,
ఎదో ఒక నాడు గర్జించెను యథార్థ ఆక్రందన ।౪।