అసమర్థులు పరిపాలన
అసమర్థులు పరిపాలన


నీతి తెలిసినా అవనీతిని నిత్యం అనుసరిస్తే,
అధినేత మేలుకొని తనకుతానే కోరీ నిదురిస్తే,
ఉన్నతి ప్రగతి ప్రయత్నానలను నిలిపేస్తే,
బలహీనులను నిరంతరం అకారణంగా వేధిస్తే,
ప్రజల ప్రాథమిక అధికారాలపై వేటు వేస్తే,
సుస్థిర ఆర్థిక పరిస్థితిని దారుణంగా ఆక్రమిస్తే,
అసత్య ప్రచారం ద్వారా నమ్మించి మోసం చేస్తే,
పేదలు ఆస్తిపరుల మధ్య విరోధం భేదం పెంచేస్తే,
దృఢమైన చట్టబద్ధ ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు వేస్తే ,
నిష్పాక్షిక వంచనలేని పాత్రికేయులపై కక్ష సాధిస్తే,
ప్రభుత్వ స్వయంపాలిత సంస్థల స్వయంపాలనం నశిస్తే,
పోటీపడగల వ్యాపార అవకాశాల్ని కొంతమందికి అప్పగించేస్తే,
అత్యవసర ఆరోగ్య సేవలను వ్యక్తిగత సంస్థలకు ఇచ్చేస్తే ,
న్యాయాధిపతి న్యాయాలయాలుండగా అన్యాయం పడగవిప్పి గెలిస్తే ,
రాజ్యాంగ నీ
తి నియమాలను ప్రజా ప్రతినిధులు ఉద్యోగిస్వామ్యం ఉల్లంఘిస్తే,
నిత్యావసర వస్తువుల ఉత్పత్తుల ధరలు ఏకధాటిగా పెంచేస్తే,
ఉన్నత విద్య శోధన పరిశోధన ఆపేస్తే,
దేశ ఆర్థిక సంస్థలు దివాళా తీస్తే,
దేశంలో ఆర్థిక సంక్షోభం తీసుకువస్తే,
అధర్ములు విధర్ముల అక్రమ పరిపాలన సంభవిస్తే,
దుఃస్థితిని గాలిలో దీపంలా వదిలేస్తే,
పరిస్థితి చేజారెను ఏకాధిపతి నియంత్రిస్తే,
ఎం ప్రయోజనం అబద్ధపు కోతలు కూతలు కూస్తే కోస్తే,
నష్టం జరిగెను అసమర్థుల చేతులలో పరిపాలన ఇచ్చేస్తే,
దేశం ధ్వంశం అయ్యెను ప్రజాస్వామ్యం అస్తమిస్తే ,
ఈ అసహనీయ అతార్కిక పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే,
ఏమీ మిగలదు ఆఖరి నిమిషంలో ప్రజలలో చైతన్యం సద్బుద్ధి లభిస్తే !!
జ్ఞానహీనమైన నేతని ఎంచుకుంటే ప్రజలు స్వయంగా వేసుకున్న తిరుగని శాస్తే !!