కరోనా వైద్యులు...
కరోనా వైద్యులు...


కరోనా వైద్యులు!
కరోనా రోగులకు
చికిత్స చేసే వైద్యులు..
కర్ర తో సమాజానికి
చికిత్స చేసే పోలీస్ లు..
కట్ట తో పరిసరాలకు
చికిత్స చేసే పారిశుధ్య కార్మికులు..
ఇలా తెలిసి తెలిసి...
వైరస్ వాటేస్తుందని తెలిసి..
కరోనా కాటేస్తుందని తెలిసి..
ప్రాణాలు పోతాయని తెలిసి.. కూడా
కర్తవ్య నిర్వహణ లో అలసి..
ఇంటికెళ్ళి కుటుంబాన్ని కలసి..
అంతలోనే వాళ్ళందర్నీ వెలి వేసి..
కరోనా పై యుద్ధం చేసి!
వ్యాపారులు..
రైతులు..
విద్యుత్ ఉద్యోగులు..
మెడికల్ షాప్ వాళ్ళు..
మీడియా వాళ్లు...
అన్నం పెట్టే అమ్మలు..
పాల బూత్ లా వాళ్ళు...
గ్యాస్ బాయ్ లు...
వాటర్ బాయ్ లు..
ఇలా ఎందరో...మహానుభావులు!
అందరూ మనకోసం...బయట
మనమంతా మాత్రం ...
ఇంట్లోనే వుండాలంట!
అదే వాళ్ళ కష్టానికి ...
మనమిచ్చే గౌరవమంట!
.....రాజ్.......