STORYMIRROR

ఉదయబాబు కొత్తపల్లి

Action Classics Inspirational

4  

ఉదయబాబు కొత్తపల్లి

Action Classics Inspirational

ప్రవహిస్తున్న దృశ్య చిత్రం...!

ప్రవహిస్తున్న దృశ్య చిత్రం...!

1 min
275


కొన్ని విధ్వంసాలు 

చిత్రంగా కుంచెకు అందవు...

సహజ వర్ణాలనద్దుకున్న 

 ప్రళయ సన్నివేశాలే 

ప్రకృతి చిత్రించిన 

ఛాయాచిత్రాలౌతాయి.

రంగులన్నీ పాకిపోయి  

 మిళిత వికృత వర్ణమొక్కటి 

ఉదయించి  

కాన్వాసు అవసరం లేని 

నూతన కళ 

రాజ్యమేలుతుండగానే  

ఎత్తునుండి పల్లానికి 

ప్రవహించే కుంచె ఒకటి 

ఆ దారిని చిత్రించుకుంటూ వెళ్తుంది.

విలయానికి విగతవస్తువులన్నీ 

సాక్ష్యాలుగా మిగులుతూ 

మచ్చలు తేలిన ముఖాల్ని 

గుర్తుచేస్తుంటాయి.

మానవత్వాన్ని ప్రతిబింబిస్తున్న

పిడికిళ్ళుతెడ్లుగా చేసుకుని  

చిత్రాన్ని చీల్చుతూపోతున్న నావ

 ఆలంబన చుక్కానితో

 ఆక్రందనల దారాలకు వేలాడుతున్న 

అభాగ్య అమాయక ప్రాణాలను 

హృదయపు లోగిలిలో పొదువుకున్న చందం.

తల్లి మనసు లాలనతో 

చిత్రపు చిరుగును  

ఓదార్పు దారం తో  కుట్టుకుంటూ  

మరలిపోతుంటే 

ఆ మకుటాయమాన వర్తమాన చిత్రం  

తాకుతున్న ప్రతి బండరాయి కన్నీరై  

 కరిగి గంగ యై మలగి 

ప్రశ్చన్నసూర్యోదయం వైపు  

సాయమందిస్తూ ...

సాగిపోతూ...సాగిపోతూ...!!!

సమాప్తం



Rate this content
Log in

Similar telugu poem from Action