STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

ఎవరికెవరు ఈలోకంలో!

ఎవరికెవరు ఈలోకంలో!

1 min
371

ఎవరికెవరు ఈ లోకంలో!


తమ్ము...ఆన్న..

ఏరా..ఒరేయ్...

అండి....సార్...

మావ...బావ...

అంటూ..

ఎప్పడూ ఆనందంగా..

పలకరించుకుంటూ..

నీ అవసరం లో..నేనుంటా అంటూ..

ఒకరికొకరం మాట ఇచ్చుకుంటూ..

కలిసి సాగే..కామన్ మ్యాన్ ని..


నీ కోరలతో..

మా కాళ్ళను కట్టిపడేసి..

కనికరం లేని కఠినాత్ములను చేసిన..

ఓ..దయలేని కరోనా!


దయలేనిది...

నీకో..లేక ... మాకో

తెలియని అయోమయంలో పడేసావు!


కళ్ళెదురుగా ఖననం అవుతున్నా..

మా ఆప్తుల..మిత్రుల..

తనువులను తలచి తలచి...

తల్లడిల్లటం తప్ప..

కనీస తలుపు కూడా తీయని..

నీచపు దుస్తితి..కల్పించిన

ఓ..కరోనా..

ఇకనైనా...నీ దాహం తీరేనా?😭😭


(కరోనా తో..

కాలం చెళ్ళతున్న..నా ఆప్తులు..

మిత్రులు.. శ్రేయోభిలాషుల..

ఆత్మకు శాంతి కలగాలని...అశ్రు నయనాలతో)


          ......రాజ్.....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy