STORYMIRROR

VENKATALAKSHMI N

Action Fantasy Others

4  

VENKATALAKSHMI N

Action Fantasy Others

కనపడని యుద్ధం

కనపడని యుద్ధం

1 min
328


ఎంత దారుణం కదా

కనపడని క్రిమి

కల్లోలం సృష్టిస్తు

ప్రపంచ స్థితి గతులను

తారుమారు చేసి

వున్న చోటే వుండమంటూ

గంజినీళ్ళైనా తాగి బతకమంటూ

ఎక్కడి వాళ్ళు అక్కడే గప్ చుప్

అంటూ సమస్తాన్ని

తన గుప్పిట్లో వుంచి

శాసిస్తున్నది కరోనా

తన మన ఇహ పర

బీద బిక్కి గొడ్డుగోద

జాలిదయ చూపక

కనపడితే కాటేసి

కాటికి పంపే దాకా

అంతు చూసి

మనిషి గర్వాన్ని అణుస్తున్నది

ఇదీ ఒక మేలుకొలుపేనని

ధైర్యం గుంజలు పాతి

ఆత్మస్థైర్యమనే దడి కట్టి

టీకాతో కరోనాను ఖతం చేద్దాం

మాస్క్ తో దూరం పాటించి

శుభ్రతతో జాగరూకత కలిగి

విడివిడిగా వుంటూ

కలివిడిగా పోరాడుదాం

అడుగు బయట పెట్టకనే

అందరూ నిశ్శబ్దయుద్ధం చేద్దాం

ఇంటికే పరిమితమయి

దుష్ట కరోనాను దరిచేరనీక ఆపుదాం


Rate this content
Log in

Similar telugu poem from Action